
తాళిబొట్టు గొలుసు, ముక్కుపుడక, చెవి కమ్మలు, వెండి పట్టీలు మూట కట్టి భక్తురాలు వనజాక్షి హుండీలో వేశారు. అయితే రెండు రోజుల క్రితం జరిగిన హుండీ లెక్కింపులో నగలు చూపించకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో భక్తురాలు వనజాక్షి దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు దేవస్థానం సిబ్బంది చేతివాటంపై ఫిర్యాదు చేశారు. భక్తురాలి సమక్షంలోనే దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. హుండీ లెక్కించే సమయంలో నగల మూట మ్యాట్ కింద ఉండిపోవడంతో గమనించలేదని ఈవో రమేష్ చెబుతున్నారు. దేవస్థానం సిబ్బంది పంపకంలో తేడా రావడంతోనే నగల మూట తిరిగి హుండీలో వేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు భక్తురాలు ఫిర్యాదు చేసే వరకు నగల మూట మాయంపై ఉన్నతాధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆలయ ఈవో రమేష్ ను ఉన్నతాధికారులు ప్రశ్నించారు. హుండీ లెక్కింపు తర్వాత మ్యాట్ తొలగిస్తున్నప్పుడు క్లీనింగ్ సిబ్బందికి నగలమూట కనిపించడంతో… తిరిగి తనకు అప్పగించారని… వెంటనే నగల మూటను హుండీలో వేశానని విచారణ అధికారులకు ఈవో రమేష్ సమాధానం ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యారెట్, బీట్ రూట్ కలిపి జ్యూస్ తాగుతున్నారా ?? దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
రైల్వే స్టేషన్లో చాట్ అమ్ముకుంటున్న అదానీ సోదరుడు
కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేకపోతున్నారు ?? ఆ మంత్రగాడు మాత్రం ఎలా ఎక్కాడు?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మ్యాంగో.. దీని ధర తెలిస్తే దిమ్మతిరుగుతుంది