ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో తన హాస్య శైలితో ప్రసిద్ధి చెందారు. ఆయన తరచుగా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తారు. ఆయన మళ్ళీ అలాంటి ఒక ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన వారు నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఈ ఫోటోలో ఒక హాస్పిటల్ సైన్ బోర్డు ఉంది. లైటు పనిచేయకపోవడం వల్ల ఆ హాస్పటల్ పేరుకి ఉన్న అర్ధం మారిపోయింది. ఇది ప్రజలకు నవ్వుని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. హర్ష్ గోయెంకా ఈ ఫోటోను ఆస్వాదించడమే కాదు.. ఇతరులు కూడా దీనిని ఆస్వాదిస్తున్నారు.
ఈ ఫోటోలో మీరు ఒక ప్రధాన ప్రైవేట్ ఆసుపత్రి వెలుపల “లాష్ ఆసుపత్రి” అని రాసిన పెద్ద బిల్‌బోర్డ్‌ను చూడవచ్చు. బిల్బోర్డ్లోని లైట్లలో ఒకటి పనిచేయకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగింది. ఇది వాస్తవానికి కైలాష్ ఆసుపత్రి ఫోటో.. కానీ “కై” అక్షరానికి పెట్టిన లైట్ పనిచేయకపోవడంతో చిత్రం “లాష్ ఆసుపత్రి”గా మారింది. హర్ష్ గోయెంకా ఈ ఫోటోను అనుకోకుండా చూసి.. సరదా కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇది త్వరగా వైరల్ అయింది. ఈ ఫన్నీ ఫోటో ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండింగ్‌లో ఉంది.
ఇవి కూడా చదవండి
“‘కై’ లైట్ ఆరిపోయినప్పుడు.”
హర్ష్ గోయెంకా ఈ ఫన్నీ ఫోటోను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్, ఎక్స్‌లో షేర్ చేసి, “‘కై’ లైట్లు చెడిపోయినప్పుడు” అనే క్యాప్షన్ జత చేశారు. ఈ ఫోటోను వేల సార్లు వీక్షించారు. వందలాది మంది లైక్ చేశారు. వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.
వైరల్ చిత్రాన్ని చూడండి
जब ‘कै’ की लाइट ख़राब हो जाए 😀 pic.twitter.com/hVCm43Qh1B
— Harsh Goenka (@hvgoenka) October 18, 2025
ఆ చిత్రాన్ని చూసిన ఒక యూజర్ సరదాగా “మనం రిసెప్షన్ కి వెళితే జేబులు ఖాళీ అవుతాయి, అడ్మిట్ అయితే శరీరం ఖాళీ అవుతుందని కామెంట్ చేశారు. మరో యూజర్ కూడా “సోదరా..పేషెంట్ భయంతో చనిపోతాడెమో అని వ్యాఖ్యానించారు. ఈ హాస్పిటల్ పేరు చదివి ఇక్కడ చేరమని చెప్పండి అని ఒకరు.. ఈ ఫోటో చాలా హాస్పిటల్స్ ప్రస్తుత స్థితిని ప్రతిబింబిస్తుంది” అని వ్యాఖ్యానించగా, మరొకరు, “ఇకపై ఇక్కడ ఎవరూ చికిత్స పొందేందుకు ధైర్యం చేయరు” అని కామెంట్ చేశారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
