ఇదే క్రమంలో ఈ నూతన సేవలను అందించడానికి చిప్‌ల సామర్థ్యం కూడా పెంచుకోవాల్సి వస్తున్నదని, కానీ గ్లోబల్ మార్కెట్లో వీటి కొరత ఎక్కువగా ఉన్నదని, వీటికి అధిక మొత్తంలో నిధులు వెచ్చించి కొంటున్నామని స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ప్రతినిధి తెలిపారు.మొబైల్ తయారీ సంస్థలపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికి వీటి ధరలు పెంచక తప్పదని కంపెనీలు సంకేతాలిస్తున్నాయి. భవిష్యత్తులో ప్రజలకు చౌకగా స్మార్ట్ఫోన్లు లభించే అవకాశాలు లేవని, విలువ-నూతన టెక్నాలజీ కలిగిన స్మార్ట్ఫోన్లు కావాలంటే అధిక మొత్తంలో నిధులు వెచ్చించాల్సి రావచ్చునని ఆయన చెప్పారు. మరోవైపు, ప్రస్తుతం మార్కెట్లో ఏఐ టెక్నాలజీతో తయారైన స్మార్ట్ఫోన్లకు గిరాకీ ఉంది. మొత్తం విక్రయాల్లో వీటి వాటా 2024లో 3 శాతంగా ఉండగా, 2025 తొలి ఆరు నెలల్లో 13 శాతానికి ఎగబాకిందని కౌంటర్‌పాయింట్ రీసర్చ్ తెలిపింది.
మరిన్ని వీడియోల కోసం
