
ఈ మధ్యకాలంలో సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ హడావుడి ఎక్కువైంది. స్టార్ హీరోయిన్స్ కూడా స్పెషల్ సాంగ్స్ చేయడానికి వెనకాడటం లేదు. ఒకప్పుడు ఐటెం సాంగ్స్ అని పిలిచే ఈ పాటలు ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు సినిమాలకు పక్కాగా ఓ స్పెషల్ సాంగ్ ఉంటుంది. ఎలాంటి జోనర్ సినిమా అయినా సరే స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే. ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ కోసం సపరేట్ నటీమణులు ఉండేవారు. కానీ ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తున్నారు. సీనియర్ హీరోయిన్స్ నుంచి లేటెస్ట్ యంగ్ బ్యూటీస్ వరకు అందరూ స్పెషల్ సాంగ్స్ లోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఓ హాట్ బ్యూటీ స్పెషల్ సాంగ్ గురించి ఆసక్తికర విషయాన్నీ పంచుకుంది. స్పెషల్ సాంగ్స్ చేస్తుంటే నన్ను మరోలా చూస్తున్నారు అంటూ ఓ స్టార్ హీరోయిన్ ఆవేదన వ్యక్తం చేసింది.
ఆమె ఎవరో కాదు.. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలిన అందాల భామ తమన్నా. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో తెగ సందడి చేస్తుంది. అక్కడ సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ లోనూ నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారింది ఈ చిన్నది. ఇటీవలే రైడ్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది. అయితే తమన్నా స్పెషల్ సాంగ్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
స్పెషల్ సాంగ్స్ చేయడం నాకు పెద్ద తప్పు అని ఎప్పుడూ అనిపించలేదు. దాదాపు పదేళ్ల నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా స్పెషల్ సాంగ్స్ చేస్తూనే ఉన్నా.. ఏ విషయానైనా లిమిట్స్ దాటి చూడాలి నేను ఎప్పుడూ అలానే చూస్తా.. స్పెషల్ సాంగ్ అనేది ఓ ఎమోషన్ అని నేను భావిస్తా.. నేను నా అందమైన రూపంతో స్పెషల్ సాంగ్ కు డాన్స్ చేయడం మ్యాజిక్ గా ఉంటుందని నా ఫీలింగ్. చాలా మంది స్పెషల్ సాంగ్స్ చేస్తుంటే మరోలా చూస్తున్నారు. అదేదో పెద్ద తప్పుగా చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చింది తమన్నా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.