
దీనిపై బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ దీపక్ కృష్ణమూర్తి తాజాగా స్పందించారు.సైఫ్ వేగంగా కోలుకోవడంపై కొంతమంది వైద్యులు కూడా సందేహాలు వ్యక్తం చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. ఇలా అనుమానించే వారికి అసలు వెన్నెముకకు జరిపే శస్త్రచికిత్స గురించి తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. తన తల్లి 78 ఏళ్ల వయసులో వెన్నెముక ఆపరేషన్ జరిగిన రోజే నడిచిందని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను డాక్టర్ పోస్టు చేశారు. ఆ వయసులోనూ తన తల్లి నడవగలిగినపుడు 54 ఏళ్లు ఉన్న సైఫ్ వారం రోజుల్లో నడుచుకుంటూ వెళ్లడంలో ఆశ్చర్యం ఏముందని ప్రశ్నించారు. ఈ విషయంపై అనుమానం వ్యక్తం చేస్తున్న వైద్యులు వెన్నెముకకు జరిపే ఆపరేషన్ గురించిన మెడికల్ బుక్స్ రిఫర్ చేయాలని సూచించారు.