
వేసవి రద్దీ దృష్ట్యా తిరుపతికి పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్, మే నెలల్లో వారానికి రెండు చొప్పున నడపనున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తిరుమల తిరుపతి వెళ్లే ప్రయాణికుల కోసం 32 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. మే 23వ తేదీ వరకు ఈ స్పెషల్ ట్రైన్స్ వారానికి రెండు సార్లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు ప్రకటించారు. చర్లపల్లి నుంచి 07017 నెంబరు గల రైలు శుక్ర ఆదివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఇక తిరుపతి నుంచి 07018 నెంబరు గల రైలు శని, సోమవారాల్లో నడుస్తుంది. ఇది మల్కాజిగిరి, కాచిగూడ, మహబూబ్‌నగర్, జడ్చర్ల, డోన్, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతూ వెళ్తుంది. చర్లపల్లి నుంచి ఉదయం 9: 35 గంటలకు బయలుదేరుతుంది ఈ స్పెషల్ ట్రైన్. తిరుపతి నుంచి సాయంత్రం 4: 40 గంటలకు హైదరాబాద్ బయలుదేరుతుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దొంగతనంలో వీరి నైపుణ్యం వేరప్పా.. చక్కగా వచ్చారు.. చటుక్కున్న కొట్టేసారు
మీ పిల్లలకు ఐస్‌క్రీమ్ కొనిస్తున్నారా? ఈ భయంకర వ్యాధులు తప్పవు!
వైట్ రైస్‌కి బదులుగా ఓట్స్ తింటున్నారా ?? జరిగేది ఇదే..
రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. ఇకపై అలా కుదరదు..
మంచం తో కారు తయారుచేసి.. రోడ్డుపై తిరిగిన వ్యక్తి.. కట్ చేస్తే షాకిచ్చిన పోలీసులు