
అందాల ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం, ఈ నటి పాప్ కార్న్ అనే మళయాళ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
తర్వాత తెలుగు, కన్నడలో చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వలో హిందీలో కూడా నటిగా సత్తా చాటడానికి రెడీ అవుతుంది.
ఈ బ్యూటీ తెలుగులో బింబిసార సినిమాలో నటించి మెప్పించింది. అంతే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీమ్లనాయక్ సినిమాలో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది.
ఇక తాజాగా ఈ అమ్మడు రెడ్ కలర్ చీరలో దర్శనం ఇచ్చింది. స్లీవ్ లెస్ బ్లౌస్ ధరించి, బంగారు వర్ణంతో కూడిన ఎరుపు రంగు చీరలో అందాల మద్దుగుమ్మగా అందంగా కనిపించింది.
ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో తన అభిమానులు బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.