
సింగరేణి సంస్థ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారి ఇతర రాష్ట్రాల్లో తవ్వకాలు చేపట్టింది , సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL). బుధవారం(ఏప్రిల్ 16) నుంచి ఒడిశాలోని నైనీ బొగ్గు గనిలో ఉత్పత్తి ప్రారంభించింది. ఈమేరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. భారతదేశ ఇంధన భద్రత, ఆర్థిక వృద్ధికి ఇది గర్వకారణం అన్నారు. సింగరేణి విస్తరణ, పెరుగుతున్న సహకారాన్ని సూచిస్తుందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో కేంద్ర ప్రభుత్వం, బొగ్గు మంత్రిత్వ శాఖ తరపున, ఈ బొగ్గు బ్లాక్ నిర్వహణలో ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మొత్తం సింగరేణి కుటుంబం విజయం సాధించాలని, రాబోయే అనేక మైలురాళ్లను అధిగమించాలని కోరుకుంటున్నట్లు కిషన్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు.
𝐇𝐢𝐬𝐭𝐨𝐫𝐢𝐜 𝐌𝐢𝐥𝐞𝐬𝐭𝐨𝐧𝐞 𝐟𝐨𝐫 𝐒𝐢𝐧𝐠𝐚𝐫𝐞𝐧𝐢 𝐢𝐧 𝐎𝐝𝐢𝐬𝐡𝐚!
For the first time in its 136-year legacy, Singareni Collieries Company Limited (SCCL) begins coal production outside Telangana today, at the Naini Coal Block in Odisha.
A proud moment for SCCL,… pic.twitter.com/KT4ZgFqN2N
— G Kishan Reddy (@kishanreddybjp) April 16, 2025
ఒడిశాలోని నైనీ గనిలో 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఏడాదికి కోటి టన్నుల చొప్పున 38ఏళ్లపాటు తవ్వకాలు చేపట్టనున్నారు. ప్రస్తుతమున్న ఉపరితల గనుల్లో ఇదే అతిపెద్దది. నైనీలో అత్యంత నాణ్యమైన జీ-10 రకం బొగ్గు ఉన్నట్టు అంచనా. కాగా, తెలంగాణ కాకుండా తొలిసారి ఇతర రాష్ట్రాల్లో బొగ్గు తవ్వకాలు చేపట్టబోతోంది సింగరేణి. — ఇప్పటివరకు తెలంగాణకే పరిమితమైన సింగరేణి.. ఇప్పుడు ఒడిశా రాష్ట్రంలో అడుగుపెడుతోంది. నైనీ బొగ్గు గనిలో తవ్వకాలను వర్చువల్‌గా ప్రారంభించారు.
ఒడిశాలోని నైనీ గనిని 2016లో సింగరేణికి కేటాయించింది మోదీ ప్రభుత్వం. అన్ని అనుమతులు సాధించి తవ్వకాలు ప్రారంభించడానికి తొమ్మిదేళ్ల సుదీర్ఘకాలం పట్టింది. సింగరేణికి ఉన్న ఉపరితల గనుల్లో ఇదే అతిపెద్దది. ఇక్కడ 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అత్యంత మేలైన జీ-10 రకం బొగ్గు ఇక్కడ ఉన్నట్టు గుర్తించింది సింగరేణి. ఏడాదికి కోటి టన్నుల చొప్పున 38ఏళ్లపాటు ఇక్కడ బొగ్గు తవ్వితీయనున్నారు. ఒడిశాలో ప్రారంభించిన నైనీ బొగ్గు బ్లాక్‌ను సింగరేణి విస్తరణలో తొలి అడుగుగా కేంద్రమంత్రి అభివర్ణించారు. సింగరేణి ఇక్కడి నుండి ఇతర రాష్ట్రాలు, దేశాలకు కూడా విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలో ప్రపంచ సంస్థగా రూపాంతరం చెందుతుందని కేంద్ర మంత్రి అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..