
కొలంబియాలోని కార్టజేనాలోని రాఫెల్ నునెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 40 ఏళ్ల కొలంబియన్ వ్యక్తిని అరెస్టు చేశారు. అతను పెట్టుకున్న హెయిర్ విగ్ లోపల కొకైన్‌ను దాచి అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించాడు. ఆమ్స్టర్డామ్కు విమానం ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న పెరీరాకు చెందిన ఆ వ్యక్తి విగ్లో 220 గ్రాముల (7.76 ఔన్సులు) కంటే ఎక్కువ కొకైన్ ఉందని పోలీసులు కనుగొన్నారు. ఎయిర్‌పోర్ట్‌లో స్కాన్ చేస్తుండగా.. అతని విగ్ అనుమానాస్పదంగా అనిపించింది. దీంతో కాస్త పరీక్ష పెట్టగా.. లోపల డ్రగ్స్ ఉన్నట్లు కనుగొన్నారు. బాడీ స్కాన్ నుండి తీసిన ఫుటేజ్‌లో భారీ మొత్తంలో కొకైన్ ఉన్నట్లు వెల్లడైంది. బిబిసి ప్రకారం , 10 లక్షల విలువైన ఆ డ్రగ్స్‌ను 400 డోసులుగా విభజించినట్లు గుర్తించారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం , కొలంబియా ప్రపంచంలో కొకైన్ ఎగుమతి చేసే దేశాల్లో టాప్ ప్లేసులో ఉంది. 2023 లో ఆ దేశం కోకా ఆకు సాగు, ఉత్పత్తి విషయంలో కొత్త రికార్డును సృష్టించింది.
పంటి నొప్పితో ఆస్పత్రికొచ్చి ప్రాణాలు కోల్పోయింది.. డాక్టర్లు CT స్కాన్ చేయగా
మస్క్ కాళ్లను ట్రంప్ పట్టుకున్నట్టుగా వీడియో.. అమెరికా ప్రభుత్వ కార్యాలయంలో టెలికాస్ట్.. చివరకు..
అయ్యో.. ఆ బంగారు టాయిలెట్‌ను దొంగలు దోచుకెళ్లారు!వీడియో