
వారంతా సరదాగా ట్రిప్‌కు వెళ్లారు.. ఎంజాయ్ చేసేందుకు కేబుల్ కార్ ఎక్కారు.. అదే శాపంగా మారుతుందని ఆ పర్యాటకులు గ్రహించలేదు.. కేబుల్ కార్ లో ప్రయాణిస్తుండగా.. కేబుల్ ఒక్కసారిగా తెగిపోయింది.. దీంతో క్యాబిన్ లోయలో పడి నలుగురు మరణించారు.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.. తీగలపై వెళ్లే కేబుల్ కార్ ప్రమాదవశాత్తూ కింద పడడంతో నలుగురు మృతి చెందిన ఘటన ఇటలీలో చోటుచేసుకుంది. దక్షిణ ఇటలీ నేపుల్స్కు సమీపంలోని మోంటెఫైటో సమీపంలో పర్వత ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
అనంతరం కేబుల్ కార్ లలో ప్రయాణిస్తున్న 16 మందిని ప్రాణాలతో రక్షించారు సహాయ సిబ్బంది. ఇటలీలోని కాస్టల్లామేరీ స్టీబియా నుంచి మౌంట్ ఫాటియో మధ్య ఎత్తులో ఏర్పాటు చేసిన ఇనుప తీగలకు ఉన్న సపోర్ట్ కేబుల్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఫలితంగా.. తీగలకు వేళాడుతున్న కారు ఒక్కసారిగా కింద పడడంతో విషాదం నెలకొంది. మృతుల్లో బ్రిటీష్ దంపతులు, ఓ ఇజ్రాయిల్ మహిళ, కేబుల్ కార్ ఆపరేటర్ ఉన్నారు.
వీడియో చూడండి..
Four tourists were killed and one critically injured after a cable car crashed near Monte Faito, Italy, due to a snapped cable. Rescue efforts are hindered by harsh weather at 1,500m altitude. The injured victim was airlifted to a hospital. pic.twitter.com/QUvRpFUwsP
— Geopoliti𝕏 Monitor (@GeopolitixM) April 17, 2025
ఇక.. ఈ ఘటనతో అదే మార్గంలో వెళ్తున్న మరో రెండు కేబుల్ కార్స్ కూడా గాల్లో వేలాడడంతో టూరిస్టులు కంగారుపడిపోయారు. సుమారు 16 మందిని తాళ్ల సాయంతో రెస్క్యూ సిబ్బంది కిందకు దింపారు. కాగా.. ఈ కేబుల్ కారు 1952 నుండి నడుస్తోంది.. 1960 లో జరిగిన ఇలాంటి ప్రమాదంలో నలుగురు మరణించినట్లు మీడియా వెల్లడించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..