Karimnagar Tourism- హైదరాబాద్ నుంచి సుమారు160 కిలోమీటర్ల దూరంలో ఉండే కరీంనగర్ జిల్లా కేంద్రం ఉంటుంది. ఇది తెలంగాణలోని ఒక చారిత్రాత్మక పట్టణం. దీనిని ‘వేద అభ్యాస పీఠం’ అని పిలుస్తారు. అనేక చారిత్రాత్మక కట్టడాలకు, అధ్యాత్మిక కేంద్రాలకు ఈ జిల్లా నిలయంగా ఉంది. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం లాంటి ప్రముఖమైన దైవ సన్నిధాలు సందర్శించవచ్చు.
ఇక్కడి చారిత్రక సంపదలైన ఎలగంధల కోట, నగునూర్ ఫోర్ట్, రామగిరి ఫోర్ట్, మోలంగూర్ ఫోర్ట్, జగిత్యాల కోటలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఎలాంటి గుంతలు, అడ్డంకులు లేని పరిశుభ్రమైన రహదారిపైన స్మూత్ రైడ్‌ను అనుభవించాలనుకునే వారికి, కరీంనగర్ మంచి ఛాయిస్ అవుతుంది.
