
శ్రీరామ నవమి వేడుక, శ్రీ సీతారాములోరి కళ్యాణ ఉత్సవాలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీరాముడు మధ్యాహ్నం సమయంలో జన్మించాడని, అందుకే ఈ రోజున పూజలన్నీ మధ్యాహ్నం సమయంలోనే నిర్వహిస్తుంటారు. ఈ రోజున శ్రీరాముని ఆలయాలు, ఆంజనేయుని దేవాలయాలన్నీ శ్రీరామ నామ స్మరణతో మారుమోగిపోతాయి. ఇకపోతే, ఆ సీతారాములపై ఉన్న భక్తిని ఒక్కొక్కరు ఒక్కోరకంగా చాటి చెబుతారు రామ భక్తులు. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన ఒక యువకుడు రాముడిపై ఉన్న భక్తిని అరుదైన రీతిలో, తనకున్న సూక్ష్మకళ ద్వారా ప్రదర్శించాడు. ఎవరూ చేయని విధంగా బియ్యపు గింజలపై శ్రీరామ అష్టకం రాశారు.
కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలకు సూక్ష్మ కళాకారుడు రాజారెడ్డి, కొబ్బరి బొండాలు కళ్యాణ తలంబ్రాలు సమర్పించారు. ద్వారంపూడి యువ రాజారెడ్డి 15వ సంవత్సరం శంకు చక్ర నామ కళ్యాణ కొబ్బరిబండాలను, బియ్యపు గింజలపై రామనామ లికిత తలంబ్రాలను సిద్ధం చేశారు.
15 సంవత్సరాలుగా ప్రతి శ్రీరామనవమి రోజున రామ కళ్యాణానికి ప్రతి బియ్యపు గింజ పై రామ అనే నామాన్ని రాస్తారు. ఇందుకోసం ఎటువంటి సూక్ష్మ పరికరము లేకుండా హిందీ ఇంగ్లీష్ తెలుగు భాషల లో రాసి వాటిని తలంబ్రాలుగా సమర్పించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. 100116 ( లక్షా నూట పదహారు) బియ్యపు గింజలను తలంబ్రాలుగా ముక్కోటి ఏకాదశికి ప్రారంభమైన ఈ యజ్ఞం శ్రీరామనవమి ఉదయం వరకు కొనసాగిస్తుంటారట.
ఆలయ ధర్మకర్తలు ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి దంపతులు స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు ముఖ్య అతిధుల చేతుల మీదుగా స్వామివారికి వీటిని సమర్పించారు రాజారెడ్డి. రాముని కృపతో రామ నామ తలంబ్రాలను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు లో స్థానం సంపాదించాలని గొల్లల మామిడాడ పేరును ప్రపంచవ్యాప్తం చేయాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్టుగా చెప్పారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..