

ఆయన ఇంటికి 500 మీటర్ల దూరంలో రోడ్డు పక్కన పడుకున్న కుక్కకు కారు తగిలింది. అయితే ఈ ఘటనలో కుక్కకు ఎలాంటి గాయాలు కాలేదు. అయినా కారు తనకు తగలడంతో ఆ శునకానికి కోపం వచ్చింది. కారు తనకు కనపడకుండా పోయేవరకు గట్టిగా అరుస్తూ వెంబడించింది. ఘోషి కుటుంబం వివాహానికి హాజరై అర్ధరాత్రి ఒంటి గంటకు ఇంటికి చేరుకుంది. వారు కారును ఇంటి ముందు పార్కు చేసి లోపలికి వెళ్లారు. ఉదయం లేచి తన కారును చూసుకున్న ఘోషి బిత్తరపోయారు. ఎందుకంటే ఆ కారుపై అన్నీ గీతలే ఉన్నాయి.