శబరిమల మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కుమిలి నుంచి పంబ వైపు వెళ్లే రహదారిపై పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే, తిరిగి వచ్చే భక్తులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కారణంగా ఈ కొండచరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. వర్షాల ధాటికి ఈ ప్రాంతంలోని జలపాతాలన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారిపై మట్టి, రాళ్లు పేరుకుపోవడంతో వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ బహిరంగ లేఖ
తోకలపూడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో చిల్లర దొంగ చేతివాటం
దీపకాంతుల్లో అయోధ్య.. రెండు గిన్నిస్ రికార్డులు
ల్యాండ్ అవుతూ.. కుప్పకూలిన విమానం
ఆ ఏడు గ్రామాల్లో నిశ్శబ్ద దీపావళి.. కారణం..
