
ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో దానిమ్మ ఒకటి. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ గింజల్లో శరీరానికి అవసరమైన విటమిన్ కేతో పాటు విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. అలాగే దానిమ్మలో ఇతర ఖనిజాలు కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. రోజు తినడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. దానిమ్మ గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. కానీ కొంతమంది దానిమ్మ పండ్లను తినడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఏయే వ్యాధులు ఉన్నవారు దానిమ్మ గింజలకు దూరంగా ఉండాలో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇప్పటికే తక్కువ రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు దానిమ్మ గింజలను తినడం మానుకుంటే చాలా మంచిదట. దీనివల్ల ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట. ఇప్పటికే రక్తంలో అధిక చక్కెరతో బాధపడుతున్న వారు దానిమ్మ గింజలను తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే, ఇప్పటికే ఎసిడిటీ, పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ కడుపుతో దానిమ్మ తినరాదని చెబుతున్నారు.
కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు దానిమ్మ పండు తీసుకోవడం వల్ల సమస్యలు మరింత తీవ్రమవుతాయి. అలాగే, చర్మ అలెర్జీ ఉన్నవారు దానిమ్మ తినడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. తక్కువ రక్తపోటు మందులు తీసుకునే వ్యక్తులు దానిమ్మ తింటే శరీరానికి హాని కలిగిస్తుంది. అజీర్ణ సమస్యలున్నవారు ఈ పండును తినడం వల్ల కడుపు ఉబ్బరం, అసౌకర్యం కలుగుతుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు దానిమ్మ తింటే హార్మోన్ల అసమతుల్యతకు గురవుతారు. స్కిన్ ఎలర్జీ ఉన్నవారు కూడా దానిమ్మ గింజలను తినడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..