
జనగామ జిల్లా చిలుపూరు మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన చందులాల్ అనే యువకుడు హనుమకొండలోని గోపాలపురంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో తన స్నేహితుడి లాగిన్ ఐడీ తో జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ సంస్థల్లో పనిచేస్తున్నాడు. జలుసాలకు అలవాటు పడిన ఈ యువకుడు బైక్స్ చోరీలకు ప్లాన్ వేశాడు. కేవలం స్ప్లెండర్, ఫ్యాషన్ ప్లస్ వాహనాలను మాత్రమే వీడు చోరీ చేశాడు. మిగతావి ఏవి వీడికి నచ్చవు. ఆ వాహనాలు ఎక్కడ కనబడితే అక్కడ మాయం చేసేవాడు. ఏడారాది వ్యవధిలో 18 బైకులు చోరీ చేశాడు. వాటిలో కొన్ని వాహనాలు తన ఇంట్లో దాచుకొని మరికొన్ని వాహనాలను తన ఖర్చుల కోసం తక్కువ ధరకు అమ్మేశాడు. వరంగల్, హైదరాబాద్, రాజకొండ పోలీస్ కమిషనరేట్లతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో కూడా ఇతనిపై చోరీ కేసులు నమోదయ్యాయి. చాకచక్యంగా పట్టుకున్న హసన్ పర్తి పోలీసులు ఇతన్ని చోరీల గుట్టుమట్టు రట్టు చేశారు.
మరిన్ని వీడియోల కోసం :