కడప జిల్లా ప్రొద్దుటూరు లో ఓ ఇంటి యజమాని తీరు అందరిని ఆగ్రహానికి గురిచేసింది .. తన ఇంట్లో అద్దెకు ఉంటూ చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కనీసం ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకున్న ఆ యజమాని తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్నన్ని రోజులు అద్దె తీసుకున్న ఆ యజమాని మానవత్వాన్ని మరిచి కఠినంగా వ్యవహరించాడు. దాదాపు రెండు గంటలసేపు మృతదేహాన్ని ఇంటిలోకి రానివ్వకుండా అడ్డుకున్నాడు. దీంతో స్థానికులంతా ఏకమై ఇంటి యజమాని తీరును ఎండగట్టారు. అంతేకాదు, అతని తీరుపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి ఇంటి యజమానితో మాట్లాడి ఆ మృతదేహాన్ని ఇంటిలోకి తీసుకువెళ్లేలా ఒప్పించారు. ఇంటి యజమాని తీరును అసహ్యించుకున్న స్దానికులు ఇన్నాళ్లూ అతను చెల్లించిన అద్దె డబ్బులు దండుకొని మనిషి చనిపోతే ఇంట్లోకి రానివ్వకపోవడం దారుణమని, సాటి మనిషి పట్ల సానుభూతితో ఉండాలని హితవు పలికారు.
మరిన్ని వీడియోల కోసం :
