

హోలికా దాహన్ చోటీ హోలీ అని కూడా పిలిచే హోలికా దహన్ మార్చి 13 గురువారం రాత్రి జరుపుకుంటారు. ఇది హోలీ పండుగ ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇక్కడ ప్రజలు స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకొంటారు. మార్చి 14న హోలీ అనేది లక్షలాది మంది జరుపుకునే ప్రధాన భారతీయ పండుగ. ఇది రంగులు ఒకరికొకరు చల్లుకునే పండగ. ఈ పండగ రోజు రకరకాల రంగులతో, రంగుల నీళ్లను చల్లుకుంటూ వైభవంగా జరుపుకొంటారు.మార్చి 28 జమాత్ ఉల్-విదా పండుగ వస్తుంది. రంజాన్ చివరి శుక్రవారం నాడు జరుపుకునే ఈ పండుగ ప్రార్థనలు, ఖురాన్ పారాయణం, దానధర్మాల ద్వారా జరుపుకుంటారు. మార్చి 30న ఉగాది… మరాఠీ, కొంకణి హిందువులకు గుడి పడ్వా కొత్త సంవత్సరం ప్రారంభం. హిందూ క్యాలెండర్లో చైత్ర మాసం మొదటి రోజున జరుపుకునే ఇది వసంతకాలం రాకను సూచిస్తుంది. ఉగాది అనేది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సరం. మార్చి 31న భారతదేశంలో ఈద్-ఉల్-ఫితర్ మార్చి 31న జరుపుకుంటారు.