

అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్బెహారాకు సమీపంలోని గురీ అనే చిన్న గ్రామానికి చెందిన ఆదిల్ థోకర్ చదువుకోవాల్సిన వయసులో అతివాద భావజాలానికి ప్రేరేపితుడయ్యాడు. యుక్త వయస్సులో చదువు పేరుతో పొరుగు దేశాలకు వెళ్లాడు. 2018లో పాక్ నుంచి విద్యార్థి వీసా సాధించి వాఘా సరిహద్దు దాటాడు. అక్కడ పలు నిషేధిత ఉగ్ర సంస్థలకు చెందిన ముష్కరులతో చేశారు. వాళ్లతో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత దాదాపు 8 నెలల పాటు కుటుంబానికి దూరంగా అజ్ఞాతంలో గడిపాడు. పాక్ వీసా తీసుకొవడంతో అతనిపై నిఘా పెట్టిన ఇంటలిజెన్స్ ఏజెన్సీలు అతడు లష్కరే తోయిబా సంస్థలో చేరినట్లు గుర్తించారు.
అయితే సుమారు ఆరేళ్ల తర్వాత అదిల్ థోకర్ భారత్‌కు తిరిగొచ్చాడు. గతేదాడి చివర్లో పూంఛ్-రాజౌరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖను దాటి అక్రమంగా భారత్‌లోకి చొరబడ్డట్టు తెలుస్తోంది. అతడితో పాటు మరో ముగ్గురు కూడా భారత్‌లోకి ప్రవేశించినట్టు నిఘా వర్గాల సమాచారం. సరిహద్దు ప్రాంతంలో గుట్టలు, దట్టమైన అటవీ ప్రాంతం ఉండటంతో భద్రతా దళాల కంట పడకుండా ఆదిల్ దేశంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. సరిహద్దు నుంచి తన స్వస్థలానికి చేరుకున్న ఆదిల్ కొన్ని రోజుల పాటు అండర్ గ్రౌండ్లో దాక్కున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. అక్కడే ఉండి స్థానిక టెర్రరిస్ట్ సెల్స్‌తో సంప్రదింపులు జరుపుతూ పహల్గాం దాడికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో భారీ కుట్రకు ఆదిల్ ప్లాన్ చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం అనువైన ప్రదేశాన్ని ఎంచుకునేందుకు స్థానిక ఉగ్ర విభాగాలతో అతడు చర్చించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రవిభాగాల సూచనలతో భద్రతా బలగాలకు సవాలుగా ఉండే తప్పించుకునేందుకు వీలుగా ఉండే బైసరన్ లోయ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
పతకం ప్రకారం ఏప్రిల్ 22న మరి కొంత మంది ముష్కరులతో కలిసి బైసరన్లోయలోని దట్టమైన అడవి ప్రాంతంలోకి ప్రవేశించిన అధిల్ థోకర్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పర్యాటకులను చుట్టుముట్టారు. పేర్లు అడిగి మరీ అతి దారుణంగా హిందువులపై కాల్పులు జరిపారు. కొందరినీ ఇస్లామిక్ శ్లోకాలు చదవమన్నారు, చదవరి వారిని నిర్ధాక్షణంగా కాల్చిచంపారు. చంపొద్దు అని వేడుకుంటున్నా కనికరించలేదు. ఇద్దరు వీదేశీయులతో సహా మొత్తం 28 మందిని పొట్టనపెట్టుకున్నారు. తర్వాత అక్కడి నుంచి అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన తర్వాత ఆదిల్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను పోలీసులు విడుదల చేశారు. వీరి ఆచూకీ చెప్పినవారికి రూ.20లక్షల రివార్డు ప్రకటించారు. ప్రస్తుతం వీరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…