
నజ్రియా నజీమ్. మలయాళంలో ఈ చిన్నదానికి విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే తెలుగు ఒకే ఒక్క సినిమా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నేచురల్ స్టార్ నాని సరసన నటించింది నజ్రియా నజీమ్. అంటే సుందరానికి అనే సినిమా చేసి ప్రేక్షకులను మెప్పించింది నజ్రియా నజీమ్. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ఫెవరెట్ హీరోయిన్ అయ్యింది. తెలుగులో ఈ సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. కానీ మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ వయ్యారి భామ. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
నజ్రియా రాజా రాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. 2014లో అంజలి రచన దర్శకత్వం వహించిన బెంగుళూరు డేస్ చిత్రంలో నజ్రియా నటించింది. ఇందులో ఫహద్ ఫాజిల్ నజ్రియా భర్తగా నటించాడు. ఈ సినిమా సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. దాని తర్వాత నిజ జీవితంలో భార్యాభర్తలుగా మారిపోయారు. పెళ్లి తర్వాత ఈ జంట తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. నజ్రియా మలయాళంలో సినిమాలు చేస్తుంటే.. ఫహద్ ఫాజిల్ రీసెంట్ గా తెలుగులో పుష్ప 2తో భారీ హిట్ అందుకున్నాడు.
అయితే గత కొద్దిరోజులుగా నజ్రియా సోషల్ మీడియాలో సైలెంట్ అయ్యింది. ఇటీవల సూక్ష్మ దర్శిని అనే సినిమా చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత నజ్రియా ఎవరితోనూ కాంటాక్ లో లేదని తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సినీ ఫ్యామిలీ నుంచి ఎవ్వరు ఫోన్ చేసినా కూడా స్పందించలేదట. దాంతో నజ్రియా భర్త ఫహద్ నుంచి విడిపోతుందంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. తాజాగా నజ్రియా అందరినీ క్షమించమని కోరుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ” మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. నేను కొంతకాలంగా ఎందుకు దూరంగా ఉన్నానో పంచుకోవడానికి కొంత సమయం కేటాయించాలనుకుంటున్నాను. మీలో చాలా మందికి తెలిసినట్లుగా, నేను ఎప్పుడూ చాలా యాక్టివ్ గా ఉంటాను. అయితే, గత కొన్ని నెలలుగా.. నా వ్యక్తిగత సవాళ్లతో నేను ఇబ్బంది పడుతున్నాను, నా మనసు కుదురుగా లేదు. అందువల్ల కాస్త డిప్రషన్ లోకి వెళ్లాను. గత కొన్ని నెలలుగా తాను అనేక ముఖ్యమైన కార్యక్రమాలను మిస్ అయ్యాను..నా 30వ పుట్టినరోజు , నూతన సంవత్సర వేడుకలు, నా చిత్రం ‘సూక్ష్మదర్శిని’ విజయంతో పాటు అనేక ఇతర ముఖ్యమైన క్షణాలను నేను మిస్ అయ్యాను నన్ను క్షమించండి.
నేను మౌనంగా ఉన్నానో వివరించనందుకు , ఫోన్ కాల్స్ తీసుకోనందుకు లేదా మెసేజస్ కు రిప్లే ఇవ్వనందుకు.. నా స్నేహితులందరిని క్షమాపణలు కోరుతున్నాను. నేను కలిగించిన ఆందోళన లేదా అసౌకర్యానికి నేను నిజంగా చింతిస్తున్నాను. అలాగే పని కోసం నన్ను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్న నా కో స్టార్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరిని నేను క్షమాపణలు కోరుతున్నాను. నా వల్ల ఏవైనా అంతరాయాలకు నేను క్షమించండి” అని నజ్రియా రాసుకొచ్చింది. అలాగే .. తాను త్వరలోనే కోలుకుంటానని అందరికీ హామీ ఇచ్చింది. “ఇది చాలా కఠినమైన ప్రయాణం, కానీ నేను ప్రతిరోజూ కోలుకోవడానికి, మెరుగుపడటానికి కృషి చేస్తున్నానని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో మీ అవగాహన, మద్దతును నేను అభినందిస్తున్నాను. పూర్తిగా తిరిగి రావడానికి నాకు మరికొంత సమయం అవసరం కావచ్చు, కానీ నేను కోలుకునే మార్గంలో ఉన్నానని హామీ ఇస్తున్నాను. ఇలా సడన్ గా అదృశ్యమైనందుకు నా కుటుంబం, స్నేహితులు, అభిమానులందరికీ నేను వివరణ ఇవ్వాలి అనిపించింది కాబట్టి నేను ఈ రోజు దీన్ని రాశాను. అంటూ భావోద్వేగ లేక రాసింది నజ్రియా. దాంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నజ్రియా జీవితంలో ఏం జరుగుతుంది అంటూ ఆరాలు తీస్తున్నారు. కాగా నజ్రియా పోస్ట్ పై స్టార్ హీరోయిన్ సమంత స్పందించింది.. ఈ పోస్ట్ కు లవ్ సింబల్ ను కామెంట్ లో షేర్ చేసింది సామ్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.