
రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ.. ఆతర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయాడు. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ డేస్లో పెద్ద హిట్స్ కొట్టకపోయినా విజయ్ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. ఇక ఇప్పుడు విజయ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో విజయ్ పోలీస్ ఆఫిసర్ గా కనిపించనున్నాడు.
విజయ్ దేవరకొండ చాలా మంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అయితే పై ఫొటోలో విజయ్ దేవరకొండతో ఉన్న హీరోయిన్ గుర్తుందా.? విజయ్ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అలాగే కెరీర్ బిగినింగ్ లో ద్వారకా అనే సినిమా చేశాడు పెళ్లి చూపులు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత విజయ్ నటించిన సినిమా ద్వారక. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అసలు ఈ సినిమా వచ్చిపోయినట్టు కూడా చాలా మందికి తెలియదు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన భామ పేరు పూజాజవేరి.
ఈ అమ్మడు భమ్ బోలేనాథ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, గుజరాతి భాషల్లోనూ సినిమాలు చేసింది. తెలుగులో జగన్నాటకం, రైట్ రైట్, టచ్ చేసి చూడు, 47 డేస్, బంగారు బుల్లోడు, మాయగాడు. మిక్సప్ లాంటి సినిమాల్లో నటించింది. కానీ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తుంది ఈ అమ్మడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.