
అసలు వీరితో కాళి ఎలాంటి గతాన్ని పంచుకున్నాడు..? ఐపిఎస్ అయిన ఎస్.జె.సూర్య పెద్దాయన కొడుకును ఎందుకు చంపాలని అనుకుంటాడు..? పెద్దాయన కోరికను కాళి తీరుస్తాడా..? అనేది సినిమా కథ.ఇలాంటి యాక్షన్ రివెంజ్ డ్రామాల్లో కథలో చిన్న పాయింట్ ఉంటే సినిమా మొత్తాన్ని ఆసక్తికరంగా మార్చవచ్చు. ఈ సినిమాలోనూ అలాంటి పాయింట్ ఒకటి ఉంటుంది. కానీ, ఆ పాయింట్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా పర్ఫెక్ట్గా ప్రెజెంట్ చేసి ఉండాల్సింది. ఇక ఈ సినిమాలో కాళి పాత్రలో విక్రమ్ తన నుంచి మంచి స్కోప్ ఉన్న పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అటు ఎస్.జె.సూర్య పర్ఫార్మెన్స్తో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేశాడు.కథను ఎంగేజింగ్గా తీసుకెళ్లాలని దర్శకుడు పడిన తాపత్రయం మనకు సినిమా ప్రారంభంలోనే కనిపిస్తుంది. కథలోకి తీసుకెళ్లేందుకు అతడు ఎంచుకున్న విధానం కొంతమేర ఆకట్టుకుంటుంది. ఇక కథను నెరేట్ చేసిన విధానం కూడా పర్వాలేదనిపిస్తుంది.యాక్షన్ సీక్వెన్స్ల కంపోజిషన్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. అటు హీరో ఎలివేషన్స్ కూడా కొంతమేర ఆకట్టుకుంటాయి. సంగీతం పరంగా బీజీఎం వర్క్ బాగుంది. సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు కలిసొచ్చే అంశం అని చెప్పాలి.