
కొన్ని ఆచారాలు చాలా వింతగా ఉంటాయి. ఇండియాలో వివిధ రాష్ట్రాల్లోని అనేక వర్గాలు పలు రకాల సంప్రదాయాలు పాటిస్తూ ఉంటారు. అందులో కొన్ని అస్సలు చాలా షాకింగ్‌గా ఉంటాయి. అయితే ఈ ఆచారాలు, సంప్రదాయాలు మతం, సమాజం, ప్రాంతం ఆధారంగా మారుతూ ఉంటాయి. కాగా, హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక గ్రామంలో ఓ వింత సంప్రదాయం ఉంది. అక్కడ పెళ్లి తర్వాత వధువు ఒక వారం పాటు బట్టలు వేసుకోదు. ఈ ప్రత్యేకమైన సంప్రదాయాన్ని హిమాచల్ ప్రదేశ్‌లోని మణికరణ్ లోయలోని పిని గ్రామంలో పాటిస్తారు. ఈ సమయంలో, వధూవరుల మధ్య ఎటువంటి సంభాషణ ఉండదు.
ఈ గ్రామంలో, సావన్ నెలలో కూడా వివాహం తర్వాత బట్టలు ధరించకూడదనే ప్రత్యేకమైన సంప్రదాయం పాటిస్తారు. ఈ సమయంలో, వధువు పట్టు అనే ఉన్ని వస్త్రాన్ని ధరించడానికి అనుమతి ఉంది. వరుడు కూడా పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. వివాహం తర్వాత, వరుడు మొదటి వారం పాటు మద్యం ముట్టుకోకూడదు. వధూవరులు ఈ ఆచారాలను పాటిస్తే, వారికి శుభాలు కలుగుతాయని నమ్ముతారు. అలాగే మణిపూర్‌లో కూడా థాబా అనే ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది. మణిపురి వివాహంలో చివరి ప్రక్రియ దీనిలో వధూవరుల కుటుంబాలకు చెందిన ఇద్దరు మహిళలు రెండు చేపలను నీటిలోకి వదులుతారు. ఈ పని వధూవరుల వివాహాన్ని వర్ణిస్తుంది.
ఈ చేపలు కలిసి ఈత కొడితే, ఆ జంట తమ సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కూడా ఆనందిస్తారని నమ్ముతారు. సాధారణంగా వరుడి వైపు నుండి ఇద్దరు మహిళలు, వధువు వైపు నుండి ఒక మహిళ నిర్వహిస్తారు, ఈ ఆచారం సామరస్యం, సాంగత్యాన్ని సూచిస్తుంది. అలాగే ఉత్తరప్రదేశ్‌లో ఒక ప్రత్యేకమైన ఆచారం ఉంది. యూపీలోని కొన్ని ప్రాంతాలలో, వరుడి కుటుంబంపై గులాబీ రేకులకు బదులుగా టమోటాలు చల్లే ఆచారం ఉంది. ఇది చాలా వింతగా, సరదాగా ఉంటుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.