
సొరకాయలో 90 శాతం నీరు ఉంటుంది. దీంతో ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండొచ్చు. వేసవి కాలంలో సొరకాయ రసం తాగితే డీహైడ్రేషన్ సమస్య రాదు. అలాగే, శరీరంలోని మలినాలు అన్నీ బయిటకు పోతాయి. బాడీ డీటాక్సిఫికేషన్ కోసం సొరకాయ జ్యూస్ తాగడం ఉత్తమం అంటున్నారు నిపుణులు.
సొరకాయ జ్యూస్‌తో మెటబాలిజం పై ప్రభావం పడుతుంది. దీంతో జీవక్రియ పెరగడం వల్ల కేలరీలని సులువుగా కరిగించుకోవచ్చు. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. తక్కువ ఆకలి వేస్తుంది. బరువు అదుపులో ఉంటుంది. సొరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడతాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. గుండె సమస్యలు రావు.
సొరకాయలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. ఇది శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. దీంతో తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. బ్లోటింగ్, మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు.
రెగ్యూలర్‌గా సొరకాయ తినటం వల్ల శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీని వలన చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. చర్మంపై నల్లటి మచ్చలను తగ్గించడంలో, చర్మం ప్రకాశవంతంగా ఉంచడంలో సొరకాయ ఎంతో దోహదం చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు సొరకాయలో అధికంగా ఉంటాయి. దీని వలన చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది.
సొరకాయలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దీని వలన చర్మంపై మొటిమలు తగ్గుతాయి. శరీరంలో వ్యర్థాలను తొలగించడంలో సొరకాయ ఎంతో దోహదం చేస్తుంది. దీని వలన చర్మం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. సొరకాయను రెగ్యులర్‌గా తీసుకోవడం వలన చర్మం హైడ్రేటెడ్‌గా, పొడిబారిపోకుండా ఉంటుంది.