
ఈ బాండ్ల కాలపరిమితి 8 సంవత్సరాలు. 2017 మార్చిలో జారీ చేసిన నాల్గవ విడత బాండ్ల మెచ్యూరిటీ ధరను తాజాగా RBI ప్రకటించింది. ఆ సమయంలో గ్రాముకు రూ.2,943 చొప్పున బాండ్లను జారీ చేయగా, ప్రస్తుత ధరను రూ.8,624గా నిర్ణయించారు. దీని ప్రకారం, అప్పట్లో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు దాదాపు రూ.3 లక్షలు లభిస్తాయి. దీనికి అదనంగా, బాండ్లపై ఏటా 2.50 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. గ్రాము ధరను నిర్ణయించడానికి, మెచ్యూరిటీ తేదీకి ముందు వారం రోజులపాటు 999 స్వచ్ఛత కలిగిన బంగారం ధరను, ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ నిర్ణయించిన సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటారు. అదే విధంగా, 2019-20 సిరీస్-4 కు సంబంధించిన ప్రీ-మెచ్యూరిటీ విండోను కూడా మార్చి 17గా నిర్ణయించారు. దీనికి గ్రాము ధరను రూ.8,634గా నిర్ణయించారు. ఈ ధరను నిర్ణయించడానికి మెచ్యూరిటీకి ముందు వారం చివరి మూడు పని దినాలను అంటే మార్చి 11, 12, 13 తేదీలలో బంగారం ధరలను పరిగణనలోకి తీసుకుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
Pawan Kalyan: మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది’ పవన్ ఎమోషనల్