
లైంగిక కోరికలు పెంచేందుకు కొంతమంది పురుషులు వయాగ్రా లాంటి మాత్రలు వాడుతుంటారు. అయితే ఈ మాత్రలు తీసుకుంటే మరణం సంభవిస్తుందా అనే ప్రశ్న సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికంగా తీసుకుంటే అమృతం కూడా విషమే’ అన్నట్లుగా, ఈ మాత్రలను అతిగా వాడటం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు ఉంటాయని, కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వయాగ్రా తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం..
గుండెపోటు ప్రమాదం
వయాగ్రాను క్రమం తప్పకుండా తీసుకునే పురుషులలో గుండె సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గుండె సమస్యలు ఉన్నవారు ఈ మాత్రను అస్సలు తీసుకోకపోవడం మంచిది. వయాగ్రా వాడకం వల్ల కలిగే గుండెపోటు కొన్ని సందర్భాలలో మరణానికి దారితీయవచ్చు.
తక్కువ రక్తపోటు
వయాగ్రా పనిచేయడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది. అయితే కొంతమంది పురుషులు మాత్ర వేసుకున్న వెంటనే ఫలితం లేదని భావించి, ఒకదాని తర్వాత ఒకటి అధిక మోతాదులో మాత్రలు వేసుకుంటారు. డాక్టర్ స్టోన్స్ మెన్స్ క్లినిక్ వైద్యుల అభిప్రాయం ప్రకారం.. అధిక మోతాదు వల్ల తక్కువ రక్తపోటు ఏర్పడి, అది ప్రాణాంతకం కావచ్చు. ఈ రకమైన మాత్రలు తీసుకునేటప్పుడు తక్కువ బీపీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
వికారం – వాంతులు
ఈ మాత్రలను నిరంతరం తీసుకోవడం వల్ల కొందరిలో వికారం లేదా వాంతులు వచ్చే సమస్యలు కనిపిస్తాయి. ఈ ఇబ్బంది మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంతో పాటు మెదడు, అన్నవాహిక, కాలేయం ఆరోగ్యంపై కూడా దీర్ఘకాలికంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
దీర్ఘకాలిక తలనొప్పి
కొన్ని సందర్భాలలో దీర్ఘకాలికంగా వచ్చే తలనొప్పులు వయాగ్రా దుష్ప్రభావాలలో ఒకటిగా ఉండవచ్చు. అధిక మోతాదు వాడకం అంగస్తంభన సమస్యతో సహా కొత్త ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయవచ్చు. తరచుగా దీర్ఘకాలిక తలనొప్పులను ఎదుర్కొంటుంటే వైద్యుడి సలహా తప్పనిసరి.
ఇతర ముఖ్యమైన దుష్ప్రభావాలు
వయాగ్రా వాడకం వల్ల ఇవి కాకుండా మరికొన్ని తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు..
దృష్టి సమస్యలు: కంటి చూపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
వినికిడి లోపం: వినికిడి శక్తి తగ్గడం కూడా సంభవించవచ్చు.
మానసిక సమస్యలు: ఈ మాత్రల వాడకం అలసట, మానసిక నిరాశ, ఒత్తిడి వంటి సమస్యలకు దారితీయవచ్చు.
ఏదైనా మాత్రలు లేదా మందులు ముఖ్యంగా లైంగిక పనితీరుకు సంబంధించిన మందులు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం. స్వీయ-వైద్యం ఎల్లప్పుడూ ప్రమాదకరమే.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
