
బిహార్లోని ముంగేర్ జిల్లాలో వరుడికి పూలమాల వేసిన తర్వాత వధువు తన ప్రియుడితో పారిపోయిన షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆచారం ప్రకారం వధూవరులకు జైమాల వేడుక జరిగింది. పెళ్లికొచ్చిన అతిథులు భోజనం చేస్తున్నారు. జైమాల వేడుక తర్వాత, వధువు రసగుల్లా తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికి వెళ్లి అటు నుంచి అటే తన ప్రియుడితో పారిపోయింది. ఈ ఘటనపై పెళ్లి కూతురి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ముంగేర్ జిల్లాలోని అసర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సజువా పంచాయతీలోని సతి స్థాన్ గ్రామంలో చోటు చేసుకుంది.
ఆ గ్రామంలో నివసించే అరుణ్ మండల్ కుమార్తె నందిని అలియాస్ నేహా కుమారి వివాహానికి సిద్ధమైంది. కానీ, పెళ్లి మధ్యలోనే తన ప్రియుడితో వెళ్లిపోయింది. వధువు పారిపోయిందని తెలిసి వరుడి కుటుంబ సభ్యులు భగ్గుమన్నారు. దీంతో వధువు తల్లిదండ్రులు తమ రెండవ కుమార్తెను వివాహం చేసుకోవాలని కోరారు. ఈ విషయమై వారు చాలా సేపు వరుడిని, అతని కుటుంబ సభ్యులను ఒప్పించడానికి ప్రయత్నించారు, కానీ వారు వినలేదు. అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..