
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు చేస్తుంటే మెంటలెక్కుతుందిగా.. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్. సలార్, కల్కి సినిమాలు ఇచ్చిన హిట్‌తో ప్రభాస్ స్పీడ్ పెంచేశాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా భారీ హిట్ సొంతం చేసుకుంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత ఈ సినిమాతో అభిమానులకు మంచి మీల్స్ పెట్టాడు ప్రభాస్. సలార్ సినిమాసక్సెస్ ను ఫ్యాన్ ఎంజాయ్ చేసేలోగా కల్కి సినిమాను దింపాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈమూవీ ఏకంగా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఇప్పుడు ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్.
ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ గురించి ఓ సీనియర్ హీరోయిన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి జరీనా వహాబ్. జరీనా వహాబ్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో నటిస్తున్నారు, ఈ సినిమాలో ఆమె ప్రభాస్ తల్లిగా కనిపించనున్నారు. కాగా ఈ మధ్య ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రభాస్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ప్రభాస్ ఎంతో మంచి వ్యక్తి అని, సెట్ లో అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని ఆమె అన్నారు. అదేవిధంగా వచ్చే జన్మలో నాకు ఇద్దరు కొడుకులు కావాలి వారిలో ఒకరు సూరజ్ అయితే మరొకరు ప్రభాస్ అయి ఉండాలి అంటూ ఆమె మనసులో మాట బయట పెట్టారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.