
అమాయకులకు వల వేసి భారీగా సంపాదిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ రాయుళ్లు ఈ గేమ్స్‌ను ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను వాడుకుంటున్నారు. అందుకోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. రమ్మీ లాంటి ఆన్లైన్ బెట్టింగ్‌లలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారు ఆ షాక్ నుంచి కోలుకోక, బయట మొఖం చూపించలేక బలవన్మరణాలకు పాల్పడ్ఢ ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మోహన్ అరవింద్ కుమార్ ఆన్లైన్ బెట్టింగ్‌లో 2 లక్షల రూపాయలు పోగొట్టుకుని మాదాపూర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆన్లైన్ రమ్మీ, ఇతర గ్యాంబ్లింగ్ ఆటల్లోకి కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ వెబ్సైట్లు ఇంటర్నెట్లో భారీ ప్రకటనలిస్తుంటాయి. దానికి తోడు తమ వెబ్సైట్లో సభ్యత్వం తీసుకుంటే బంపర్ ఆఫరిస్తామంటూ బుట్టలో పడేస్తున్నారు. ఆట ప్రారంభంలో డబ్బులు ఇచ్చినట్లే చేసి, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆటపై వినియోగదారులకు మోజు పెంచుతున్నారు. ఇది వ్యసనంగా మారడంతో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆటల నుంచి బయటకు రాని పరిస్ధితిలో చాలా మంది ఉంటున్నారు. ఏ సభ్యుడు రోజు ఎంత సేపు ఆడుతున్నాడనే విషయాన్ని గుర్తిస్తూ, ఆన్లైన్ సైట్ నిర్వాహకులు వారి దృష్టంతా ఆటపై ఉండేందుకు జిమ్మిక్కులు చేస్తుంటారు.
మరిన్ని వీడియోల కోసం :
బర్డ్ ఫ్లూ భయం.. అయినా ఫ్రీ చికెన్ కోసం ఎగబడిన జనం వీడియో