
తూర్పు దిశగా భూమి, సముద్రం ఒక రేఖ వద్ద ఆకాశంతో కలుస్తున్నట్టుగా ఉన్న దగ్గర దీన్ని చూడవచ్చు. ఆ గీతకు ఎగువన శుక్రుడు, కిందివైపు శని ఇంకా కిందికి నెలవంక ఒక దగ్గరకు రానున్నాయి. ఈ రెండు గ్రహాలు నయనాలై నెలవంక చిరునవ్వుతో ఉన్న పెదాలాగా కనిపించనుంది. ఈ వివరాలను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సోలార్ సిస్టమ్ అంబాసిడర్ బ్రాండ్ కాల్బెర్ట్సన్ వెల్లడించారు. శుక్రుడు, శని ప్రకాశవంతంగా ఉండటంతో వాటిని మామూలుగా వీక్షించవచ్చు. అయితే స్మైల్ ఇమేజ్ను చూసేందుకు మాత్రం స్టార్ గాజింగ్ బైనోక్యులర్ టెలిస్కోప్ అవసరమవుతాయని చెప్పారు. ఆకాశంలో ఎలాంటి మేఘాలు లేకపోతే అదే సమయంలో ఈ మూడింటి కింద బుధుడిని కూడా చూడొచ్చని ఓ మీడియా కథనం పేర్కొంది.
మరిన్ని వార్తల కోసం :