
ఏటా ఏప్రిల్ లో ఆలయ వార్షికోత్సవంలో భాగంగా బ్రహ్మ రథోత్సవం జరుపుతారు. శుక్రవారం రాత్రి రథోత్సవం నిర్వహించారు. దేవతతో పాటు పూజారులున్న రథాన్ని వేలాది మంది భక్తులు లాగారు. బ్రహ్మ రథోత్సవం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ రథానికి కట్టిన తాడు తెగిపోయింది. దీంతో విద్యుత్ అలంకరణతో ఉన్న రథం పైభాగం కూలిపోయింది. అప్రమత్తమైన భక్తులు దూరంగా పరుగులు తీరడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మిగతా రథాలతో ఊరేగింపును కొనసాగించారు.
మరిన్ని వార్తల కోసం :