
అక్కడికి ఓ యువతి వచ్చింది. ఆమె ఏదో స్టంట్ చేయాలనుకుంది. అందుకు ఆమె ఆ మంచాన్ని ఎంచుకుంది. ఆ మంచానికి కొంచెం దూరంగా వెళ్లి పరుగెత్తుకొచ్చి ఆ మంచం ఇవతలినుంచి అవతలికి జంప్ చేసింది. మొదటి, రెండో ప్రయత్నం విజయవంతమైంది. ఈసారి మంచాన్ని నిలబెట్టి దానిపైనుంచి దూకాలనుకుంది. ఆ ప్రయత్నం కూడా చేసింది. అయితే హైట్ కొంచెం ఎక్కువవడంతో కాలు మంచానికి తగిలి పడిపోయింది. దెబ్బకు అవాక్కయిన ఆ అమ్మాయి తనను ఎవరైనా చూశారేమోనని చుట్టూ పరిశీలించింది. ఒక్క మేక తప్ప అక్కడెవరూ లేకపోవడంతో హమ్మయ్య అనుకుంది. మంచంమీదే పడటంతో పెద్దగా దెబ్బలు తగిలినట్టు లేవు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే 5 లక్షలమందికి పైగా వీక్షించారు. పెద్దసంఖ్యలో లైక్ చేశారు. నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోల కోసం
సూర్యుడికి సోదరుడు ఉన్నాడా..?వీడియో
ప్లేటు నిండా రొయ్యల కర్రీ..తినాలంటే వర్రీ వీడియో