

అయితే మూడేళ్ళ తర్వాత లడ్డు అలియాస్ విష్ణు పెళ్లి కోసం మళ్లీ కలుస్తారు. వచ్చిన తర్వాత ఆ పెళ్లిలో గోల మొదలవుతుంది. లడ్డూ పెళ్లి ఘనంగా జరపాలని కోరుకుంటారు కానీ చివరి నిమిషంలో పెళ్లి కూతురు లేచిపోవడంతో ఆ పెళ్లి కాస్తా ఆగిపోతుంది. దాంతో అంతా కలిసి గోవా వెళ్తారు. గోవాలో ఓ స్మగ్లింగ్ బ్యాచ్ వల్ల ఈ నలుగురు ఇబ్బందుల్లో పడతారు. అలా అనుకోకుండా భాయ్ అలియాస్ మ్యాక్స్ అలియస్ సునీల్ వీళ్ళ జీవితంలోకి వస్తాడు. అసలు మ్యాడ్ బ్యాచ్‌తో మ్యాక్స్‌కు ఏంటి సంబంధం..? వాళ్లేం తప్పు చేసారు అనేది మిగిలిన కథ.. కేవలం బ్రాండ్‌తోనే సినిమాలు ఆడేస్తాయా.. అంటే ఆడతాయి. ఈ మధ్య మ్యాడ్ స్క్వేర్తో పాటు ఈ మధ్య కొన్ని సీక్వెల్స్ చూసాక ఇదే అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ హిట్టైతే చాలు.. వాటికి పార్ట్ 2 తీస్తున్నారు. కథ కాస్త అటూ ఇటూగా ఉన్నా కూడా బ్రాండ్‌తో బయటపడిపోతున్నాయి సినిమాలు. మ్యాడ్ స్క్వేర్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. కథ లేదు కానీ కామెడీ మాత్రం ఫుల్లుగా ఉంది. మ్యాడ్ అంటేనే కథ లేకపోయినా పర్లేదు గానీ కడుపులు చెక్కలయ్యేలా నవ్విస్తే చాలు అంటారు ఆడియన్స్. ఆ నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు దర్శకుడు కళ్యాణ్ శంకర్.