

భారీ మొసలి అకస్మాత్తుగా దాడికి యత్నించడంతో ముందు ఆమె షార్ప్ గా ఆలోచించింది. దాదాపు ఎనిమిది అడుగుల పొడవున్న మొసలి.. మరియం భర్త జో ను టార్గెట్ చేసింది. అమాంతం అతడి కాలిని నోటపట్టి గాయపరిచే ప్రయత్నం చేసింది. ఇది చూసిన మరియం షాకైంది. ఆ పరిస్థితిల్లో ఏం చేయాలో అర్ధంకాక క్షణకాలం పాటు అలాగే నిలబడిపోయింది. ఆ వెంటనే తేరుకున్న ఆమె పక్కనే ఉన్న ఇనుప టొమాటో స్టేక్‌తో మొసలి కంట్లో బలంగా పొడిచింది. టొమేటోలు ఏపుగా పెరగడానికి సపోర్ట్‌గా కర్రలు పాతడాన్ని స్టేక్ అంటారు. కంటికి తీవ్ర గాయం కావడంతో.. మొసలి జో ను విడిచిపెట్టింది. ఈ క్రమంలో మరియంకు కూడా స్వల్ప గాయాలయ్యాయి.