
మన చుట్టు ఉన్న ప్రకృతిలో లభించే ప్రతి మొక్క, చెట్టు ఎదో ఒక రకంగా ఔషధ మూలికగా పని చేస్తుంది. కొన్ని మూలికలు ఆకుల రూపంలో కూడా ఉంటాయి. ఎన్నో ఏళ్లుగా మన ఆయుర్వేదంలో ఇలాంటి మొక్కలు, ఆకులను ఔషధంగా వినియోగిస్తున్నారు. చాలా మంది ఇంట్లోనే ఆయుర్వేద మూలికలు కలిగిన మొక్కలను పెంచుకుంటున్నారు. ప్రస్తుతం పెంచుకుంటున్న వాటిలో రణపాల మొక్క ఒకటి. దీనిని వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
రణపాల ఆకు తింటే 150కి పైగా రోగాలను నయం అవుతాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణాశయంలో అల్సర్లు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్దకం సమస్యలను నివారిస్తుంది. రణపాల ఆకులు కిడ్నీల సమస్యలను నివారిస్తుంది. బ్లాడర్ లో ఉండే స్టోన్లు కరిగిపోతాయి. డయాలసిస్ రోగులకు మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. రణపాల మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, అనాఫిలాక్టిక్ లక్షణాలు అధికం. ఇందులోని ఫ్లేవనాయిడ్లూ గ్లైకోసైడ్లూ స్టెరాయిడ్లూ కర్బన ఆమ్లాలకు క్యాన్సర్‌ను నిరోధించే శక్తి ఉందట.
యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలెన్నో రణపాల ఆకుల్లో గుర్తించారు. మధుమేహులకీ, బీపీ రోగులకీ మందుగా పనిచేస్తుందనీ, శ్వాసకోశ, మూత్రాశయ, జీర్ణ సంబంధ సమస్యల్నీ ఇన్ఫెక్షన్లు, పుండ్లు వంటి వ్యాధుల్నీ నివారిస్తుందనీ ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలెన్నో రణపాల ఆకుల్లో గుర్తించారు. మధుమేహులకీ బీపీ రోగులకీ మందుగా పనిచేస్తుందనీ, శ్వాసకోశ, మూత్రాశయ, జీర్ణ సంబంధ సమస్యల్నీ ఇన్ఫెక్షన్లు, పుండ్లు వంటి వ్యాధుల్నీ నివారిస్తుందనీ ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
కామెర్లు ఉన్నవారు ఉదయం, సాయంత్రం ఈ ఆకుల రసాన్ని 30 ఎంఎల్ తీసుకుంటే వ్యాధి నయం అవుతుంది. రణపాల ఆకులను తినడం వల్ల హైబీపీ తగ్గుతుంది. మూత్రంలో రక్తం, చీము వంటి సమస్యలను నివారిస్తుంది. రణపాలలో జలుబు, దగ్గు, విరేచనాలను నయం చేసే గుణాలు ఉన్నాయి. రణపాల ఆకులను పేస్ట్ లా చేసి నుదుటిపై పట్టీలా వేస్తే తలనొప్పి తగ్గుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..