
చిరంజీవి సూపర్ హిట్ చిత్రాల్లో రాజా విక్రమార్క్ ఒకటి. ఈ సినిమాలో చిరుకి జోడిగా టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున భార్య అమల నటించి తన నటనతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఇక ఈ మూవీ రిలీజైన రెండు సంవత్సరాలకు నాగార్జున, అమల వివాహం చేసుకోవడం విశేషం.
ప్రస్తుతం సినిమాలకు గుడ్ బై చెప్పి,ఫ్యామిలీని చూసుకుంటున్న హీరోయిన్లలో సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత ఒకరు. ఈ నటి చిరుతో రొమాన్స్ చేసింది. చిరు డిజాస్టర్ మూవీలో అంజి మూవీ ఒకటి. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నమ్రత నటించింది.
స్టార్ హీరో సూర్య , నటి జ్యోతికను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. జ్యోతిక చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ఠాగూర్ లో కలిసి నటించారు.
సీనియర్ హీరోయిన్ రాధిక చిరంజీవి కలిసి దొంగ మొగుడు, న్యాయం కావాలి వంటి అనేక చిత్రాల్లో కలిసి నటించారు. ఇక ఈ నటి హీరో శరత్ కుమార్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
సీనియర్ బ్యూటీ సుమలత చిరంజీవి కలిసి శుభ లేఖ, చట్టంతో పోరాటం వంటి చాలా సినిమాల్లో కలిసి నటించారు. ఇక ఈ నటి కన్నడ నటుడు అంబరీష్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.