
ఫ్యాషనబుల్‌గా ఉండాలని, సరికొత్తగా తమని తాము ప్రపంచానికి పరిచయం చేసుకోవాలని యువత ఉవ్విల్లూరుతుంటారు. అందుకు ఎవరికి వారు తెగ తాపత్రయ పడిపోతుంటారు. కానీ ఫ్యాషన్ అనేది దుస్తుల్లో మాత్రమే ఉంటుందా? అనేది యువత అవలోకనం చేసుకోవాలి. ఎందుకంటే.. ఫ్యాషన్ పేరిట నేటి యువత దారితప్పుతోంది. నానాటికీ నిస్సిగ్గుగా తయారవుతున్నారు. పెద్దలు కల్పించుకుని ప్రశ్నిస్తే.. లేటెస్ట్ ఫ్యాషన్ అంటూ ఒక్క మాటలో తేల్చేస్తున్నారు. ఆ మధ్య బాగా చీకిపోయి మసిగుడ్డకు కూడా పనికిరాని విధంగా ఉండే జీన్స్ ప్యాంట్లు తొడుక్కుని లేటెస్ట్ ఫ్యాషన్ అంటూ.. అమ్మాయిలూ, అబ్బాయిలు ఒళ్లు చూపించుకుంటూ తిరిగారు. తాజాగా ఒన్ లెగ్డ్ జీన్స్ అంటూ మరో రకం మార్కెట్లోకి వచ్చింది. ఈ జీన్స్‌కి ఒక లెగ్ పూర్తిగా క్లాత్ ఉంటుంది. రెండో లెగ్ లిక్కర్ టైప్‌లో సగానికి కట్ చేసి ఉంటుంది. ఇంత చేసీ దీని ధర చూస్తే దిమ్మతిరిగిపోద్ది. ఏకంగా రూ.38 వేలు మరి. ధర ఎంతైనా పర్వాలేదు.. కొత్త ఫ్యాషన్ మార్కెట్లోకి వస్తే చాలు యువత పోటీపడిమరీ కొనేస్తుంటారు. ఈ విషయంలో ఒన్ లెగ్డ్ జీన్స్ కి ఎలాంటి మినహాయింపు లేదని నిరూపిస్తున్నారు.
మరోవైపు సోషల్ మీడియాలో ఈ కొత్త ఫ్యాషన్ ట్రెండ్ తెగ వెరల్ అవుతుంది. టిక్‌టాక్‌లో 16 మిలియన్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ క్రిస్టీ సారా ఈ జీన్స్‌ను యువతకు పరిచయం చేసింది. అయితే నెటిజన్లు మాత్రం ఇంటర్నెట్లో అత్యంత వివాదాస్పద జీన్స్ ఇదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఓరి దేవుడా.. ఇదెక్కడి జీన్స్ తల్లీ. ఇది ఒక కాలు దుప్పటి బయట పెట్టి నిద్రపోయినట్లు ఉందని ఓ యూజర్ తెగ బాధపడిపోయాడు.
ఇవి కూడా చదవండి
నెగెటివ్ కామెంట్లు వస్తున్నప్పటికీ ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ కోపర్ని.. దీనిని ‘వన్-లెగ్ డెనిమ్ ట్రౌజర్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే కొంత మంది యువత మాత్రం ఈ జీన్స్ కొనుగోలు చేయకుండానే తమ వద్ద ఉన్న జీన్స్‌కి ఒక లెగ్ కట్ చేసి.. వన్ లెగ్డ్ జీన్స్ స్వయంగా తయారు చేసుకుని ధరిస్తున్నారు. గత అక్టోబర్‌లో మోడల్ అమేలియా గ్రే ఇలాంటి హాఫ్ అండ్ హాఫ్ ప్యాంట్‌సూట్‌లో రన్‌వేపై క్యాట్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. బొట్టెగా వెనెటా, లూయిస్ విట్టన్ వంటి ఇతర ప్రముఖ లేబుల్లు కూడా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. కాగా 2025 ఫ్యాషన్ రంగంలో డెనిమ్ ఆధిపత్యం కొనసాగుతుంది. ముఖ్యంగా కేండ్రిక్ లామర్ ఫ్లేర్డ్ జీన్స్ పునరుద్ధరణ తర్వాత.. ఈ కంపెనీ బ్రాండ్లు హద్దులు దాటేస్తున్నాయి. ఇక సోషల్ మీడియా నెటిజన్లు కూడా డిజైనర్లు, సంస్కృతి కంటే ఫ్యాషన్ ట్రెండ్లను ఎక్కువగా ఫాలో అవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఏదీఏమైనా నేటి యువత బోల్డ్ ఫ్యాషన్‌కి ఎక్కువ ఆకర్షితులవుతున్నారు. వీలైనంత ఎక్కువగా స్కిన్ షో చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇంతరీ మీరేమంటారు..?
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.