
ఫౌజీ సినిమా షూటింగ్ సెట్‌కి వచ్చే వారం నుంచి ప్రభాస్ హాజరవుతారన్నది లేటెస్ట్ న్యూస్. ఆ మధ్య సర్జరీ కోసం ఫారిన్ వెళ్లిన ప్రభాస్ త్వరలోనే రిటర్న్ ఫ్లైట్ ఎక్కనున్నారు. ఆయనక్కడ స్టార్ట్ అవుతున్నారని తెలియగానే రెడీ అవుతోంది ఫౌజీ సెట్.
హైదరాబాద్‌లోనే మేజర్ షెడ్యూల్‌ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది ఫౌజీ. ఈ కథలో రాధేశ్యామ్లాంటి రొమాంటిక్ యాంగిల్‌ని కూడా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఫౌజీ షెడ్యూల్ పూర్తి కాగానే రాజా సాబ్‌కి సంబంధించిన పనుల మీద కాన్సెన్ట్రేట్ చేస్తారు డార్లింగ్. ఆయన కాల్షీట్ ఇచ్చేదాన్ని బట్టి రాజాసాబ్ చెప్పిన డేట్‌కే వస్తుందో లేదో తెలిసిపోతుందంటున్నారు నియర్ అండ్ డియర్స్. ఇప్పటికే రాజాసాబ్‌కి సంబంధించి మూడు పాటల రికార్డింగ్ పూర్తయింది. రాజాసాబ్‌లో ఫ్యాన్స్ ఇంకో వరల్డ్ ని విట్నెస్ చేస్తారన్నది కంపోజర్ చెబుతున్న మాట.
ఈ సినిమా సినిమాలూ ఓ కొలిక్కి రాగానే సలార్ సీక్వెల్ కూడా లైన్లో నిలబడుతుంది. ఆల్రెడీ సలార్2 పనులను ఫుల్ ప్లెడ్జ్ డ్గా అప్పుడో ఇప్పుడో మొదలు పెట్టేస్తారనే వార్తలు జోరందుకున్నాయి. కాస్త అటూ ఇటూగా ఉన్న ప్రభాస్ కెరీర్‌ని గాడిలో పెట్టిన మూవీగా సలార్ మీద స్పెషల్ రెస్పెక్ట్ ఉంది అభిమానుల్లో.
రీసెంట్గా కల్కి సీక్వెల్ గురించి మాట్లాడారు నిర్మాత అశ్వనీదత్. కల్కిలో ఉన్న కేరక్టర్లు అన్నీ కంటిన్యూ అవుతాయన్నారు. అవసరమైతే కొత్త కేరక్టర్లు వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. సో… ఇన్ని ప్రాజెక్టుల మధ్య కల్కి పనులు పూర్తి చేయాలి ప్రభాస్. మరోవైపు సందీప్ వంగా స్పిరిట్ మీద కూడా హైప్ సూపర్‌డూపర్‌గా క్రియేట్ అవుతోంది.