
ఇంట్లో ఉన్న బల్లులు, బొద్దింకలను తరిమేయాలంటే కాస్త శ్రద్ధ పెట్టాలి. బల్లులు, బొద్దింకల వల్ల వంటగది బాగా ఇబ్బందిగా మారిపోతుంది. అలాగే ఇలాంటి కీటకాలు మన ఆరోగ్యానికి ప్రమాదకరం. ఇవి వంటగదిలో ఉండటంతో ఆహారంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని దూరం చేయడానికి సహజ మార్గాలు ఉపయోగించాలి.
ప్రతి రోజు వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల బొద్దింకలు దూరంగా ఉంటాయి. శుభ్రత కలిగిన వాతావరణం ఉండటంతో ఇంటి సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. వంటగదిలో ఎప్పుడూ తడి ఉండకూడదు. నీటితో నానిన ప్రదేశాలు కీటకాలకు స్థావరమవుతాయి.
చాలామంది బొద్దింకలు, బల్లులను తరిమేయాలనే ఉద్దేశంతో బయట లభించే పురుగుమందులను ఉపయోగిస్తారు. కానీ ఇవి మనిషి శ్వాసద్వారాలపై చెడు ప్రభావం చూపుతాయి. కొన్ని మందులు అలర్జీలు కూడా కలిగిస్తాయి. కాబట్టి ఇంట్లోనే సహజ పదార్థాలతో తయారు చేసే మందు మంచిది.
రోలులో పావు చెంచా మిరియాలు వేసుకోవాలి. వాటితో పాటు రెండు పచ్చిమిర్చి వేసి బాగా దంచాలి. తర్వాత ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసి మళ్లీ దంచలి. ఈ మిశ్రమానికి కొద్దిగా నీరు కలిపి మృదువుగా అయ్యేంత వరకు మళ్లీ బాగా దంచాలి. ఇలా చేసిన తర్వాత ఒక చిన్న పాత్రలోకి తీసుకోవాలి. ఈ మిశ్రమంలో ఒక గ్లాసు నీరు కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా చేసినప్పుడు అందులోని వాసనలు నీటిలోకి కలుస్తాయి. పుదీనా, పచ్చిమిర్చి, మిరియాల కలయిక వల్ల వచ్చే వాసన కీటకాలకు అసహ్యంగా ఉంటుంది. ఇది వాటిని దగ్గరకు రానివ్వదు.
ఉదయం ఈ నీటిని ఫిల్టర్ చేసి వేరు చేయాలి. అందులో లైసోల్ మూత, డెట్టాల్ సగం మూత కలిపి మిక్స్ చేయాలి. ఈ నీటిని స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఇంట్లో ఉన్న బొద్దింకలు, బల్లులు కనిపించే చోట్ల దీనిని స్ప్రే చేయాలి. దీనివల్ల వాటిని దూరం చేసుకోవచ్చు.
ఈ నీటిని సుమారు పదిహేను రోజుల వరకు ఉపయోగించవచ్చు. స్ప్రే చేసిన ప్రదేశం చల్లగా ఉండటం వల్ల కీటకాలకి అక్కడ ఉండటం ఇష్టం ఉండదు. ముఖ్యంగా వంటగదిలో ఇది ఉపయోగపడుతుంది. ఎటువంటి దుష్ప్రభావం లేకుండా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు.
ఈ చిట్కా చాలా సులువు. సహజంగా ఉండటంతో ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు. ఇకపై బల్లులు, బొద్దింకలు రావద్దంటే ఈ చిట్కా పాటించండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. మంచి ఫలితం ఉంటుంది. మీరే మళ్లీ మళ్లీ ఈ విధానాన్ని పాటిస్తారు.