

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడకం చాలా మందికి సులభతరం అయింది. ముఖ్యంగా వంట గురించి పెద్దగా తెలియని వారు దీన్ని ఉపయోగించడం ద్వారా తేలికగా అన్నం వండుకోగలరు. తక్కువ సమయంలో బియ్యం సిద్ధం చేయాలనుకునే వారికి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఒక సరైన ఎంపికగా భావించవచ్చు. కానీ దీని వాడకంపై అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో ఉన్నాయి.
ముఖ్యంగా ఆరోగ్య నిపుణులు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడకంపై ఏం చెబుతున్నారో తెలుసా..? వారు చెబుతున్న దాని ప్రకారం ఈ కుక్కర్లో వండిన బియ్యం తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయనే ఉద్దేశ్యం ఉంది. డయాబెటిస్ ప్రమాదం పెరగడం, శరీరానికి అవసరమైన పోషకాలు తగ్గిపోవడం వంటివి. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన బియ్యం తినడం శరీరానికి సరైన పోషణ అందించకపోవడంతోపాటు రోగ నిరోధక శక్తిని తగ్గించే అవకాశాలు ఉన్నాయి.
రైస్ కుక్కర్లో బియ్యం వండేటప్పుడు కొన్ని ప్రమాదకరమైన రసాయనాలు విడుదల అవుతాయట. రైస్ కుక్కర్ తయారీలో వాడిన అల్యూమినియం పాత్రలు వంటకు పూర్తిగా సురక్షితం కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రసాయనాలతో కలసిన ఆహారం తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు రావడమే కాకుండా కాలక్రమంలో ఆరోగ్యానికి మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడకంపై మరొక ముఖ్యమైన ఆందోళన క్యాన్సర్ ప్రమాదం. ఈ కుక్కర్లో వండిన ఆహారాన్ని తరచుగా తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. రైస్ కుక్కర్ వాడకం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బియ్యం రుచికరమైనదిగా అనిపించినప్పటికీ దీని ఆరోగ్యపరమైన ప్రభావాలు గణనీయంగా ఉంటాయి.
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడకంపై ఉన్న ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని రైస్ కుక్కర్‌కు బదులుగా ప్రెషర్ కుక్కర్ లేదా మట్టి పాత్రలను వాడటం ఆరోగ్యకరమైన మార్గం. ప్రెషర్ కుక్కర్లో వండిన బియ్యం త్వరగా సిద్ధం కావడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది. అదే విధంగా మట్టి పాత్రలో బియ్యం వండితే అది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనుకూలంగా ఉంటుంది.
తక్కువ నాణ్యత గల ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లను వాడితే మరింత హానికరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. దీన్ని తరచుగా వాడటం గుండెకు హానికరం కావచ్చని కూడా నిపుణులు చెబుతున్నారు. అందువల్ల వీలైనంత వరకు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడకాన్ని తగ్గించడం మంచిదంటున్నారు. బియ్యం వండడానికి ఆరోగ్యకరమైన మార్గాలు ఉపయోగించడం, ముఖ్యంగా ప్రెషర్ కుక్కర్ లేదా మట్టి పాత్రలను వాడటం ఉత్తమం.