
మార్కెట్లో పుచ్చకాయ కొనేటప్పుడు అది స్వచ్ఛమైనదో కాదో గుర్తించటం తప్పనిసరి. ఎందుకంటే మార్కెట్లోకి కల్తీ పుచ్చకాయలు వచ్చాయి. చూడటానికి ఎర్రగా ఉన్నాయని పండ్లను తినకండి. ముందు అవి స్వచ్ఛమైనవో కాదో గుర్తించాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కల్తీ పుచ్చకాయను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మొదట పుచ్చకాయ కొన్నప్పుడు విక్రేతను ఒక చిన్న ముక్కను కట్ చేసి మీకు ఇవ్వమని అడగండి. తర్వాత కట్ చేసిన పుచ్చకాయ ముక్క లోపలి భాగాన్ని టిష్యూ పేపర్ లేదా కాటన్ బాల్ తో సున్నితంగా రుద్దండి. టిష్యూ పేపర్ రుద్దినప్పుడు రంగు మారితే అది కల్తీ పుచ్చకాయ అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెబుతోంది. అది స్వచ్ఛమైన పుచ్చకాయ అయితే దాని రంగు మారదు. ఈ సింపుల్ టిప్ ద్వారా కల్తీ పుచ్చకాయను ఈజీగా గుర్తించవచ్చని ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒకటి, రెండు కాదు.. నడిరోడ్డుపై నాట్యమాడుతున్న నాగరాజులు..
S. S. Rajamouli: ఆ టైమ్లో NTRని చూస్తే.. పూనకమొచ్చినట్టు అనిపించింది
JR NTR: లైపోనా లేక ఓజెంపిక్..? వెయిట్ లాస్పై ఎన్టీఆర్ టీం క్లారిటీ..!
థాయ్ సాంగ్కు డ్యాన్స్ ఇరగదీసిన స్కూల్ పిల్లలు
జూనియర్ ఎన్టీఆర్ పై హాలీవుడ్ హీరో కామెంట్స్.. ఇప్పుడు ఎగరేయండి కాలర్