

వేసవి కాలం వచ్చేసింది. మామిడి కాయాలు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. పచ్చి మామిడి కాయతో రకరరకాల వంటకాలను తయారు చేస్తారు. వాటిల్లో ఒకటి మామిడి కాయ. ఉగాది పండగ రోజున సంప్రదాయ వంటకంగా పులిహోర కచ్చితంగా ఉంటుంది. అందరూ ఇష్టంగా ఇనే పులిహోరను చింత పండు, నిమ్మ రసం, డబ్బకాయ రసం వంటి వాటితో కొంతమంది తయారు చేసుకుంటే.. మరికొందరు నిమ్మ ఉప్పుతో కూడా చేస్తున్నారు. అయితే అందరూ ఇష్టంగా తినే పులిహోరను మామిడికాయతో చేస్తే దాని రుచిని వర్ణించడం సాధ్యమా అనిపిస్తుంది. ఉగాది రోజున మామిడికాయ పులిహోరను ట్రై చేసి చూడండి. ఈ రోజు మామిడి పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఏ విధంగా తయారు చేయాలి? తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు:
బియ్యం – అరకిలో
పుల్లని పచ్చి మామిడి కాయ – ఒకటి
పసుపు
పచ్చి మిర్చి
ఎండు మిరపకాయలు
శనగ పప్పు
మినప పప్పు
ఆవాలు
కరివేపాకు
ఇంగువ
వేరుశనగ గుళ్ళు
జీడి పప్పు
నూనె – సరిపడా
ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం: ముందుగా తీసుకున్న బియ్యాన్ని కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని తగినంత నీరు పోసి అందులో కొంచెం నూనె, పసుపు వేసి నీరు మరిగిన తర్వాత బియ్యం పోసుకుని అన్నం వండుకోవాలి. అయితే అన్నం కొంచెం పలుకుగా ఉండేలా చూసుకుని గంజి వార్చుకోవాలి. ఇప్పుడు పచ్చి మామిడి కాయను తీసుకుని దాని తొక్క తీసి.. కోరుగా తురుముకుని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టి.. దానిలో తగినంత నూనె వేసి నూనె కాగిన తర్వాత ఎండు మిర్చి ముక్కలు, వేరు శనగ గుళ్ళు, పచ్చి శనగ పప్పు, మినప పప్పు, ఆవాలు, కరివేపాకు, నిలువుగా కట్ చేసిన పచ్చి మిర్చి వేసుకుని వేయించాలి. ఇప్పుడు ఇంగువ వేసి వేగిన తర్వాత జీడిపప్పు వేసుకుని వేయించాలి. ఇందులో కొంచెం మిడి తురుము , ఉప్పు వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు అన్నం ఒక పళ్ళెంలో వేసుకుని.. అందులో కొంచెం నూనె, పసుపు, కొంచెం కరివేపాకు తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు పక్కకు పెట్టుకున్న మామిడి తురుముని వేసుకుని గరిటతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పులిహోర పోపు కోసం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని రెడీ చేసుకున్న అన్నంలోకి వేసుకుని గరిటతో కలుపుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ మామిడి కాయ పులిహోర రెడీ.. ఇంకెందుకు ఆలస్యం. ఈ మామిడి కాయ సీజన్లో ఉగాది పండగ రోజున ఈ పులిహోరను తయారు చేసుకోండి. ఇంటిల్లపాది పండగను ఎంజాయ్ చేస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..