
మామిడిపండు తిన్న తర్వాత తక్షణమే పెరుగు తినడం వల్ల కడుపులో గ్యాస్ సమస్య, తలనొప్పి లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇది పొత్తికడుపులో ఒత్తిడి పెరగడం వల్ల తలెత్తుతుంది. పైగా దీన్ని అలవాటుగా చేసుకుంటే పేగు ఆరోగ్యానికి సమస్యలు తలెత్తే అవకాశముంది. అసహజమైన అజీర్ణం, వాయువు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
నిమ్మ, నారింజ, ముసంబి వంటి పండ్లలో యాసిడిటీ ఎక్కువగా ఉంటుంది. ఇవి మామిడిపండుతో కలిస్తే శరీరంలోని pH బ్యాలెన్స్‌ను గందరగోళం చేస్తాయి. ఇది జీర్ణవ్యవస్థలో అసమతుల్యతను కలిగించి మంట, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలకు కారణమవుతుంది. మామిడితో పాటు ఈ పండ్లను తినడం పూర్తిగా మానేయాలి.
మామిడిపండు తిన్న వెంటనే మసాలా అధికంగా ఉన్న వంటకాలను తినడం వల్ల కడుపులో మంట, ఎసిడిటీ, గుండెల్లో నొప్పి వంటి లక్షణాలు కనిపించొచ్చు. మామిడి తిన్న తర్వాత శరీరానికి చల్లదనం అవసరం.. కానీ మసాలా పదార్థాలు వేడితనం పెంచి సమస్యలు కలిగించవచ్చు. ప్రత్యేకంగా మసాలా భోజనాలను దూరంగా ఉంచడం మంచిది.
కాకరకాయలో ఉండే కొంత చేదు పదార్థాలు మామిడిపండులో ఉండే తీపి ఆమ్లాలను సమతుల్యం చేయలేవు. ఇది కడుపులో అసమతుల్యతను కలిగించి అజీర్ణం, వికారం, వాంతులు వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ రెండింటినీ కలిపి తినకుండా ఉండాలి.
చాలా మంది మామిడిపండు తిన్న వెంటనే కూల్ డ్రింక్ లు తాగుతారు. ఇది శరీరంపై హానికర ప్రభావాన్ని చూపుతుంది. కడుపు వెంటనే చల్లబడిపోవడం వల్ల జీర్ణశక్తి బలహీనపడుతుంది. ఇది జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులకు దారి తీస్తుంది. అందుకే మామిడి పండు తిన్న తర్వాత కూల్ డ్రింక్ ల నుంచి దూరంగా ఉండాలి.
మామిడిపండులో సహజంగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణక్రియపై ఒత్తిడి ఏర్పడి వాంతులు, విరేచనాలు లేదా పొత్తికడుపులో వాయువు సమస్యలు రావచ్చు. కనీసం అరగంట పాటు నీరు తాగకుండా ఉండటం వల్ల ఈ రకమైన సమస్యలు నివారించవచ్చు.