
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఏమాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే. ఈమూవీతోనే అక్కినేని నాగచైతన్య, సమంతకు మంచి స్నేహం ఏర్పడింది. చివరకు ఈ స్నేహమే ప్రేమగా మారి, చివరకు పెళ్లి వరకు వెళ్లింది. వీరిద్దరు చాలా రోజుల పాటు ప్రేమలో ఉండి, తర్వాత పెద్దలను ఒప్పించి ఘనంగా వివాహం చేసుకున్నారు.
అయితే కొన్ని కారణాల తర్వాత వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. దీంతో అంటు సమంత అభిమానులు, ఇటు చైతూ అభిమానులు షాక్ అయ్యారు. దీంతో కొందరు సామ్‌ను ట్రోల్ చేయగా మరికొందరు చైతూను ట్రోల్ చేశారు. అయితే ఇటీవల నాగచైతన్య, శోభితను రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో సమంత అభిమానులు, అసలు చై సమంతకు పరిచయం కాకుండా ఉంటే బాగుండూ, తన లైఫ్ డిస్ట్రాబ్ చేశారంటూ తెగ కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే ఏమాయ చేశావే సినిమాను గౌతమ్ మీనన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ కథను తాను మహేష్ బాబును ఊహించుకొని రాసినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
వాస్తవంగా ఏమాయ చేశావే సినిమా కథను మహేష్ బాబును ఊహించుకొని రాశను, ఆయనకు కూడా కథ బాగా నచ్చింది. కానీ తన ఇమేజ్‌కు అది సూటి కాదు అనే ఉద్దేశ్యంతో ఆ మూవీకి మహేష్ బాబు నో చెప్పారంటూ చెప్పింది.
దీంతో సమంత అభిమానులు, ఏమాయ చేశావే సినిమా మహేష్ బాబు ఓకే చేసి ఉంటే, సమంత, నాగచైతన్యకు పరిచయం కాకపోయేది, వీరిద్దరు వివాహం చేసుకోకపోయేవారు, ఎవరి లైఫ్ వారికి హ్యాప్పీగా ఉండేది అంటూ ముచ్చటిస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మారింది.