
అది అచ్చం పసుపు రంగు ఇటుకలతో నిర్మించిన రోడ్డులా ఉంది. దాన్ని చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆ రోడ్డు సముద్ర గర్భంలోకి ఎలా వచ్చిందన్న దానిపై వారు పరిశోధనలు చేపట్టారు. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆ రోడ్డు వేల ఏళ్ల క్రితం సముద్ర గర్భంలో కలిసిపోయిందా అనిపించింది. ఆ ఇటుకల రోడ్డును చూసి ‘అది అట్లాంటిస్ నగరానికి మార్గం అయి ఉంటుందా?’.. అంటూ ఓ సైంటిస్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మిగిలిన వాళ్లు కూడా దాన్ని చూసి నోరెళ్లబెట్టారు. అలా దానిపైన సైంటిస్టుల మధ్య పెద్ద చర్చే జరిగింది. అయితే, ఆ ఇటుకల రోడ్డు మానవ నిర్మితమైనది కాదని, సముద్ర గర్భంలో లావా పొంగి, పగుళ్ల కారణంగా అలా తయారై ఉంటుందని భావించారు. ఇటుకలతో రోడ్డు వేసినట్లు చాలా చక్కగా ఆ పగుళ్లు ఏర్పడ్డాయి. దాదాపు 10 అడుగుల వెడల్పుతో.. 20 అడుగుల పొడవు వరకు ఆ ప్రదేశం ఉంది. ఇటుకల రోడ్డులా కనిపిస్తున్న ఆ ప్రదేశం మొత్తం చాలా పొడిగా ఉండి,మిగిలిన ప్రదేశం తడిగా ఉండటంతో ఇదెలా సాధ్యం అని సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. దీని వెనుక అంతరార్ధం ఏమిటో సైంటిస్టులకు కూడా అర్థం కాక మిస్టరీగానే మిగిలిపోయింది.
మరిన్ని వీడియోల కోసం :
పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి ఏమైందంటే?
ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..వీడియో
ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో
పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది