
మఖానా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా చెబుతారు. వర్షాకాలం, శీతాకాలం, వేసవి కాలం.. ఇలా సీజన్ ఏదైనా సరే.. ఎల్లప్పూడు మీరు మఖానా తినవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ మఖానాను చాలా ఇష్టపడతారు. ప్రస్తుత కల్తీ యుగంలో కల్తీకి తక్కువ అవకాశం ఉన్న కొన్ని వస్తువులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వీటిలో ఒకటి మఖానా. మీరు పిల్లల ఆహారంలో మఖానాను చేర్చాలి. మీరు మఖానాను వేయించి ఖీర్ తయారు చేసుకోవచ్చు. లేదంటే, పాలలో కలుపుకుని కూడా తినొచ్చు. కానీ కొంతమంది మఖానాను బెల్లం తో కూడా తింటారు. అయితే, ఇలా మఖానా, బెల్లం కలిపి తినడం వల్ల శరీరంలో ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
మఖానా, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనివల్ల శరీరానికి విటమిన్ బి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. మఖానాలో కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. బెల్లం ఎముకల అభివృద్ధిని ప్రోత్సహించే ఇనుము, ఖనిజాలను కలిగి ఉంటుంది.
బెల్లంలో సహజ చక్కెర ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. మఖానాలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఎక్కువ కాలం చురుగ్గా ఉంచుతాయి. బెల్లం, మజ్జిగలో ఫైబర్ ఉంటుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనితో పాటు, అజీర్ణం,గ్యాస్ సమస్య తొలగిపోతుంది.
ఇవి కూడా చదవండి
బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉంటాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మఖానాలోని ప్రోటీన్, విటమిన్లు శరీరాన్ని బలపరుస్తాయి. మఖానాలో ఫైబర్ అధికంగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు నియంత్రణకు సహాయపడుతుంది. బెల్లం జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది కొవ్వును కాల్చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..