
దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే అందమైన మందార పువ్వు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మందారంలో పాలీఫెనాల్స్, ఆల్ఫా-గ్లూకోసిడేస్, ఆల్ఫా-అమైలేస్ వంటి ఎంజైములు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. మందార టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. మందార టీ గ్యాస్ట్రిక్, ప్యాంక్రియాటిక్ లైపేస్ వంటి ఎంజైమ్‌లను తొలగించడం ద్వారా శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధిస్తుంది.
ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.. ఇది శరీరానికి చాలా చల్లదనాన్ని ఇస్తుంది. కాబట్టి వేడి కారణంగా చర్మంపై మొటిమలు, కురుపులు మొదలైన వాటితో బాధపడేవారికి ఇది చాలా మంచిది. ఇందులో విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది కాలానుగుణ వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి కూడా రక్షిస్తుంది.
మందారంలో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. మందార టీ తాగడం వల్ల ఒత్తిడి స్థాయిలు, అలసట, ఉద్రిక్తత తగ్గుతాయి. వ్యాధి కారక బ్యాక్టీరియాతో మందార టీ పోరాడుతుంది. కాలేయ ఆరోగ్యానికి మందార టీ ఎంతో మేలు చేస్తుంది. మీరు జుట్టు రాలడం సమస్యతో బాధపడుతుంటే మందార టీ తాగాలి. ఇది మీ జుట్టును అందంగా, బలంగా చేస్తుంది.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..