
ఈ ఘటన చండీగఢ్‌లో జరిగింది. చండీగఢ్‌లోని సెక్టార్-20 గురుద్వారా చౌక్ వద్ద జీబ్రా క్రాసింగ్‌పై జ్యోతి అనే మహిళకు సంబంధించిన రీల్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, ప్రజా భద్రతకు ముప్పు వంటి నేరాల కింద ఆమెపై కేసు నమోదైంది. జ్యోతి భర్త అజయ్ కుందు సెక్టార్-19 పోలీస్ స్టేషన్లో సీనియర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఇన్స్టాగ్రామ్ ఖాతానుంచే భార్య జ్యోతి డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేయడంతో అజయ్ కుందును ఉద్యోగంనుంచి సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. మార్చి 20న సాయంత్రం జ్యోతి, ఆమె వదిన కలిసి సెక్టార్-32లోని ఒక ఆలయానికి దైవదర్శనం కోసం వెళ్లారు. దర్శం పూర్తిచేసుకొని తిరిగి వస్తూ జ్యోతి తన వదిన పూజ సహాయంతో డ్యాన్స్ రీల్‌ను చిత్రీకరించింది. ట్రాఫిక్ జామ్‌ను పట్టించుకోకుండా జీబ్రాక్రాసింగ్పై ఒక పంజాబీ పాటకు నృత్యం చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో హెడ్ కానిస్టేబుల్ జస్బీర్ చండీగఢ్‌లోని సెక్టార్-34 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై చండీగఢ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిడకల యుద్ధం..! ఎన్నో ఏళ్ల వింత ఆచారం..
ఒక టీ 65 వేలు, నీళ్ల బాటిల్ 50 వేలు.. ఆ రెస్టారెంట్ బిల్లుతో పట్టపగలే చుక్కలు
Naa Anveshana: సిరి హన్మంతు గుట్టు రట్టు చేసిన అన్వేష్
స్వీట్ వాయిస్ కోసం పాము వీర్యం తాగుతున్న సింగర్…