
మీకు ఆనందం అలాగే మీ ప్రయాణం మీకు ఓ జ్ఞాపకంలా ఎప్పటికీ గుర్తుండిపోవాలి అంటే తప్పకుండా ప్యాలెస్ ఆఫ్ వీల్స్కి వెళ్లాల్సిందేనంట. ఈ రైలు ప్రయాణం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఒకప్పుడు రాజస్థాన్ మహారాజులను తీసుకెళ్లిన రాజ బండ్ల అనుభవాన్ని తిరిగి మీకు అందించడానికి సృష్టించిన ఈ రైలు ప్రయాణం మంచి అనుభూతినిస్తుంది. ఈ రైలు ప్రయాణంలో విలాసవంతమైన ఇంటరీయర్స్, చక్కటి భోజన రెస్టారెంట్, ప్యాలెస్ వీల్స్ రాజస్థాన్లోని అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలను కవర్ చేస్తుంది, వాటిలో జైపూర్, ఉదయపూర్, జైసల్మేర్, జోధ్పూర్, రణతంబోర్ కూడా ఉన్నాయి.