

మార్చి 11న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కూనవరం, వరరామచంద్రాపురం, ఏలూరు జిల్లా వేలేర్పాడు.. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట, శ్రీకాకుళం జిల్లా బూర్జ, హీరామండలం, లక్ష్మీనర్సుపేట మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. బుధవారం రాష్ట్రంలోని 62 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.Voice : శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాలు, విజయనగరంలో 16 మండలాలు, పార్వతీపురంమన్యంలో 10 మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10 మండలాలు, అనకాపల్లిలో 2 మండలాలు, కాకినాడ, కోనసీమలో చెరో మండలం.. తూర్పుగోదావరి జిల్లాలో 8 మండలాలు, ఏలూరులో 3 మండలాలు ఈ లిస్టులో ఉన్నాయి. ఆయా మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉండే అవకాశముందన్నారు. బుధవారం 13 మండలాల్లో తీవ్ర, 162 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.